ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్‌కు క‌రోనా ఎలా వ‌చ్చిందంటే… !

కరోనా వైరస్ మహమ్మారి దాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇక మ‌న దేశంలో రోజు రోజుకు క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు క‌రోనా భ‌యం మ‌న తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి కూడా చుట్టుకుంది. వెండితెర‌, బుల్లితెర అన్న తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రిని క‌రోనా వెంటాడుతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుటికే టాలీవుడ్‌కు చెందిన ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, తేజ‌తో పాటు నిర్మాత బండ్ల గ‌ణేష్ సైతం క‌రోనా భారీన ప‌డ్డారు. ఇప్పుడు ఈ క్ర‌మంలోనే ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తికి సైతం కరోనా పాజిటివ్ సోకింది.

 

త‌న‌కు క‌రోనా సోకిన విషయాన్ని ఆయనే అధికారికంగా ప్రకటించారు. అజయ్ ప్రస్తుతం మహా సముద్రంను తెరకెక్కించనున్నారు. ఇందులో శర్వానంద్, సిద్ధార్థు హీరోలుగా నటించనున్నారు. అలాగే తాను మహా సముద్రంలో నటిస్తున్నానని సాయి పల్లవి సైతం క్లారిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్.ఎక్స్ 100 తర్వాత అజయ్ భూపతి నుంచి వస్తోన్న రెండో సినిమా ఇది. ఈ సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్న అజ‌య్ బ‌య‌ట ఎక్కువుగా తిర‌గ‌డంతోనే క‌రోనా వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఇక కరోనా నుంచి తాను త్వరగా కోలుకుంటానని , త్వరలోనే ప్లాస్మా దానం కూడా చేస్తానని అజయ్ వెల్లడించారు.

Leave a comment