సుశాంత్ మేనేజర్ దిశ ఆత్మ‌హ‌త్య కేసులో మ‌రో కోణం…

బాలీవుడ్ దివంగ‌త న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్య కేసులో తాజాగా ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదు దాఖలైంది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు ముందే ఆమె కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దిశ తండ్రి స‌తీష్ ఈ కేసు పెట్టారు. త‌మ కుమార్తె మ‌ర‌ణంపై పుకార్లు వ్యాప్తి చేసినందుకే ఆయ‌న ఈ కేసు పెట్టారు. సుశాంత్ – దిశ మ‌ధ్య సంబంధం ఉందంటూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నార‌ని కూడా ఆయ‌న త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

ఓ ముగ్గురు వ్యక్తులు తమ కుమార్తె దిశ పరువు తీశారని.. ఆమె గురించి పలు పుకార్లు సృష్టించారని సతీష్ సలియన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా పోస్టులు తమను మానసికంగా వేధిస్తున్నాయని విన్నవించారు. దీంతో పోలీసులు పునీత్ వసిష్ట – సందీప్ మలాని – నమన్ శర్మలపై కేసులు పెట్టారు. ఐటీచట్టం – ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు.

Leave a comment