బ్రేకింగ్‌: జ‌గ‌న్ మోసం బ‌ట్ట‌బ‌య‌లు చేస్తాం: చంద్ర‌బాబు

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్ర‌వారం ఆయ‌న హైద‌రాబాద్ నుంచి మాట్లాడారు. జ‌గ‌న్ గ‌తంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అమ‌రావ‌తి నిర్మాణానికి ఓకే చెప్పార‌ని.. ఇప్పుడు మాట మారుస్తున్నారంటూ ఆయ‌న విమ‌ర్శించారు. అమ‌రావ‌తి భూసేక‌ర‌ణ ప్ర‌పంచానికే ఆద‌ర్శం.. అమ‌రావ‌తికి ఘ‌న‌చ‌రిత్ర ఉంది. అమ‌రావ‌తి నిర్మాణం ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు పూర్త‌య్యింద‌ని కూడా బాబు తెలిపారు. జ‌గ‌న్ చేస్తోన్న ఈ మోసాన్ని వ‌దిలే ప్ర‌శ‌క్తే లేద‌ని కూడా బాబు చెప్పారు. అమ‌రావ‌తిలో అనుకున్న‌వి అనుకున్న‌ట్లుగా పూర్త‌యితే 62 వేల ఉద్యోగాలు కూడా వ‌స్తాయ‌ని చంద్ర‌బాబు అన్నారు.

Leave a comment