బ్రేకింగ్‌: ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ. బాలు ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వార్తలు వ‌స్తున్నాయి. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఆయ‌న ఈ నెల 5వ తేదీన చెన్నైలో హాస్ప‌ట‌ల్లో చేరారు. ఆయ‌న అప్ప‌టి నుంచి ఎంజీఎం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఆరోగ్యం విష‌మించ‌డంతో ఆయ‌న్ను ఐసీయూలో ఉంచి మ‌రీ చికిత్స చేయిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఇప్ప‌టికే ఎంజీఎం ఆసుప‌త్రి వ‌ర్గాలు సైతం హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. ఆరోగ్య ప‌రిస్థితి అయితే విష‌మంగానే ఉంద‌ని అంటున్నారు. దీనిపై మ‌రింత స‌మాచారం రావాల్సి ఉంది.

Leave a comment