ప్ర‌భాస్ రాధేశ్యామ్‌లో రెండు ట్విస్ట్‌లు… ఒక‌టి పూజ‌… రెండు ఎవ‌రంటే…!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం జిల్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత మ‌నోడు మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ ద‌ర్వ‌క‌త్వంలో తెర‌కెక్కే సైంటిఫిక్ సినిమాలో న‌టిస్తున్నాడు. వైజ‌యంతీ మూవీస్ సంస్థ త‌న 50 ఏళ్ల ప్ర‌స్థానం నేప‌థ్యంలో భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే రాధేశ్యామ్ సినిమా గురించి రెండు ఆస‌క్తిక‌ర వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ సినిమా క‌థ పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంద‌ట‌.

 

ఈ సినిమాలో పూజాహెగ్డే డ‌బుల్ రోల్ చేస్తుంద‌న్న‌ది ఒక ట్విస్ట్ అయితే రెండో ట్విస్ట్ వ‌చ్చేసి ఈ సినిమాలో ప్ర‌భాస్ కూడా డ్యూయ‌ల్ రోల్లో న‌టిస్తాడ‌ని.. అయితే అది చివ‌ర్లో తెలుస్తుంద‌ని.. ఆ రోల్ ఎందుకు విల‌న్‌గా మారాల్సి వ‌చ్చింద‌న్న‌ది కూడా ఆసక్తిగా ఉంటుంద‌ని ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్ప‌టికే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాను ఈ యేడాది చివ‌ర్లో రిలీజ్ చేయాల‌నుకున్నా కుద‌ర‌క‌పోవ‌డంతో వ‌చ్చే సమ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

Leave a comment