Moviesశివ‌పార్వ‌తి కౌంట‌ర్‌పై ప్ర‌భాక‌ర్ స్పంద‌న ఇదే

శివ‌పార్వ‌తి కౌంట‌ర్‌పై ప్ర‌భాక‌ర్ స్పంద‌న ఇదే

సినీ ఆర్టిస్ట్ శివ‌పార్వ‌తి క‌రోనా నుంచి కోలుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆమె తాను క‌రోనా భారీన ప‌డ‌డంతో ఇండ‌స్ట్రీలో ఎవ‌రు ఏంటో అస‌లు నిజం తెలిసింద‌ని.. తాను ప్ర‌భాక‌ర్ నిర్మిస్తోన్న సీరియ‌ల్లో న‌టిస్తున్నాన‌ని… క‌నీసం త‌న‌ను ఎవ్వ‌రూ ప‌ల‌క‌రించిన పాపాన పోలేద‌ని… తాను సినిమాలు చేయ‌డం మానేసి నాలుగేళ్లు అయ్యింద‌ని.. అయినా జీవితా రాజ‌శేఖ‌ర్ దంప‌తులు ప‌రామ‌ర్శించి సాయం చేశార‌ని వాపోయారు. క‌రోనా రావ‌డం వ‌ల్లే ఎవ‌రు ఎలాంటి వారో కూడా తెలిసింద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

 

ఇక ప్ర‌భాక‌ర్ త‌న‌ను ప‌ట్టించుకోలేద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డంతో పాటు ప్ర‌భాక‌ర్‌ను తాను ఏమీ అన‌న‌ని కూడా చెప్పారు. ఈ వీడియోపై స్పందించిన ప్ర‌భాక‌ర్ మాగ‌ట్లాడారు. చిన్న మిస్ అండ‌ర్ స్టాండింగ్‌తోనే ఇలా జ‌రిగింద‌ని… ముందు మీరు కోలుకోండి.. త‌ర్వాత అన్నీ మాట్లాడ‌దాం అని ప్ర‌భాక‌ర్ ఆమెకు ధైర్యం చెప్పిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఆమెతో మాట్లాడి చాలా రోజులు అవ్వ‌డం వల్లే ఇలా జ‌రిగింద‌ని కూడా ప్ర‌భాక‌ర్ తెలిపారు.

 

అయితే దీనిపై మ‌ళ్లీ స్పందించిన శివ‌పార్వ‌తి తాను ప్ర‌స్తుతం కోలుకున్నాన‌ని.. ఆరోగ్యంగానే ఉన్నాన‌ని… త‌న ఆర్థిక ప‌రిస్థితి కూడా బాగానే ఉంద‌ని.. తాను ఎవ్వ‌రి సాయం కోర‌లేద‌ని చెప్పారు. తాము కూడా అన్నీ మాట్లాడుకున్నాం అని.. చిన్న మిస్ క‌మ్యూనికేష‌న్స్ వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని.. తాను కూడా ఎవ్వ‌రి సాయం కోర‌లేద‌ని శివ‌పార్వ‌తి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news