Gossipsసుకుమార్ రెమ్యున‌రేష‌న్ ఇంత ప‌డిపోయిందా... రీజ‌న్ ఇదే...!

సుకుమార్ రెమ్యున‌రేష‌న్ ఇంత ప‌డిపోయిందా… రీజ‌న్ ఇదే…!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డు అయిన సుకుమార్ రంగ‌స్థ‌లం హిట్‌తో తిరుగులేని ఫామ్‌లోకి వెళ్లిపోయాడు. రంగ‌స్థ‌లం తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎప్ప‌ట‌కీ నిలిచిపోయే సినిమాగా స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాలు చూసిన స్టార్ హీరోలు, స్టార్ ద‌ర్శ‌కులే నోరెల్ల‌బెట్టారు. ప్ర‌స్తుతం సుకుమార్ మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌లో బ‌న్నీ హీరోగా తెర‌కెక్కే పుష్ప సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది.

భారీగా రెమ్యూనరేషన్ త‌గ్గించుకున్న సుకుమార్‌.. కారణం అదేనట-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమాకు గాను సుకుమార్ త‌న రెమ్యున‌రేష‌న్ చాలా వ‌ర‌కు త‌గ్గించుకున్నాడ‌ట‌. సుకుమార్ వాస్త‌వానికి ఈ సినిమా కోసం రు. 20 కోట్లు వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకోవాల‌ని అనుకున్నాడ‌ట‌. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ వేళ సుక్కు రెమ్యున‌రేష‌న్ స‌గానికి పైగా త‌గ్గించేసుకుని.. సినిమా రిలీజ్ అయ్యాక జ‌రిగే బిజినెస్‌, లాభాల్లో వాటా తీసుకోవాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. అలా చేస్తే నిర్మాత‌ల‌కు కూడా ఇబ్బంది ఉండ‌ద‌ని.. సినిమాపై భారం ఉండ‌ద‌ని సుక్కు భావిస్తున్నాడ‌ట‌.

 

ఏదేమైనా ఈ విష‌యంలో సుకుమార్‌ను మెచ్చుకోవాల్సిందే. ఇక శేషాచ‌లం అడ‌వుల్లోని గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్‌, గిరిజ‌న గూడేల నేప‌థ్యంలో ఈ సినిమా స్టోరీ లైన్ ఉంటుంద‌ని తెలుస్తోంది. వ‌చ్చే యేడాది ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news