Moviesప్ర‌ముఖ సింగ‌ర్ కారుణ్య ఇంట్లో తీవ్ర విషాదం

ప్ర‌ముఖ సింగ‌ర్ కారుణ్య ఇంట్లో తీవ్ర విషాదం

టాలీవుడ్ ప్రముఖ సినీ గాయకుడు కారుణ్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కారుణ్య త‌ల్లి జాన‌కి మృతి చెందారు. ఆమె గ‌త కొంత కాలంగా క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. ఆమె వ‌య‌స్సు 70 సంవ‌త్స‌రాలు. బాలాపూర్‌ మండలం మీర్‌పేట్‌లోని త్రివేణినగర్‌లో ఉన్న ఇంట్లోనే ఆమె తుది శ్వాస విడిచారు. కారుణ్య త‌ల్లి జాన‌కి మృతిచెందిన వార్త తెలుసుకున్న ప‌లువురు ప్ర‌ముఖులు కారుణ్య‌కు త‌మ ప్ర‌గాడ సానుభూతి తెలిపారు. కారుణ్య తల్లి కేంద్ర రక్షణ రంగ సంస్థ బీడీఎల్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు.

ప్రముఖ టాలీవుడ్ సింగర్ కారుణ్య ఇంట్లో విషాదం..!

ఇక క‌రోనా తీవ్ర‌త ఎక్కువుగా ఉన్న నేప‌థ్యంలో చాలా త‌క్కువ మంది బంధువులు, స్నేహితుల స‌మ‌క్షంలోనే సైదాబాద్‌ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఇక కారుణ్య ఎంత పాపుల‌ర్ సింగ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. హైద‌రాబాద్‌కు చెందిన కారుణ్య నార్త్ వెళ్లి అక్క‌డ ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ – 2 ద్వారా కోట్లాది మంది అభిమానుల‌ను గెలుచుకున్న గాయ‌కుడు అయ్యాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news