Moviesక‌లిసొచ్చిన హీరోయిన్‌తో రొమాన్స్‌కు రెడీ అయిన బాల‌య్య‌.... బోయ‌పాటి సినిమాలో ఆ...

క‌లిసొచ్చిన హీరోయిన్‌తో రొమాన్స్‌కు రెడీ అయిన బాల‌య్య‌…. బోయ‌పాటి సినిమాలో ఆ ఆంటీ ఫిక్స్‌..!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా, మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న బీబీ 3 సినిమా ఫ‌స్ట్ లుక్ లీజ‌ర్ ఇప్ప‌టికే రిలీజ్ అయ్యి దుమ్ము రేపుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ల కోసం కొద్ది రోజులుగా వేట కొన‌సాగుతోంది. అంజ‌లి త‌దిత‌రుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేస్తుండ‌గా సీనియ‌ర్ బాల‌య్య ప‌క్క‌న ఓ సీనియ‌ర్ హీరోయిన్ అయితేనే సెట్ అవుతుంద‌ని.. సినిమా టీం కొద్ది రోజులుగా భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ బాల‌య్య భార్య పాత్ర‌లో సీనియ‌ర్ హీరోయిన్ సిమ్రాన్‌ను తీసుకోవాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.

NBK 106 teaser: This Boyapati Srinu film is a treat for Nandamuri Balakrishna fans | Entertainment News,The Indian Express

బాల‌య్య – సిమ్రాన్‌ది సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌. వీరి కాంబోలో వ‌చ్చిన స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు వ‌చ్చాలి. ఈ రెండు సినిమాలు బాల‌య్య కెరీర్లో ఎంత ప్ర‌త్యేకమైన‌వో తెలిసిందే. అలాగే వీరి కాంబోలోనే గొప్పింటి అల్లుడు సినిమా కూడా వ‌చ్చింది. ఇక ఈ బీబీ3లో బాల‌య్య డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. గుండుతో పాటు రోల్‌తో ఫుల్ మీసం, వైట్ అండ్ వైట్ ఓవ‌రాల్‌గా చూస్తుంటే సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు.

Buzz: Simran To Come Back As This Hero's Mother? - Gulte

ఇక త‌న‌కు క‌లిసొచ్చిన డైరెక్ట‌ర్‌, క‌లిసొచ్చిన హీరోతో బాల‌య్య న‌టిస్తోన్న ఈ సినిమా బాల‌య్య‌కు సింహా, లెజెండ్ లాగా మ‌రోసారి సూప‌ర్ డూప‌ర్ హిట్ ఇస్తుందేమో ? చూడాలి. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా థ‌మన్ సంగీతం సమకూరుస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news