Gossipsత్రివిక్ర‌మ్ - మెగాస్టార్ స్టోరీ లైన్ ఇదే..!

త్రివిక్ర‌మ్ – మెగాస్టార్ స్టోరీ లైన్ ఇదే..!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేసేందుకు ప్ర‌తి ఒక్క హీరో ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక మెగా ఫ్యాన్స్ కూడా చిరంజీవి – త్రివిక్ర‌మ్ సినిమా కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిటింగ్‌లో ఉన్నారు. త్రివిక్ర‌మ్ మెగా ఫ్యామిలీలో ఒక్క బ‌న్నీతో మాత్ర‌మూ మూడు సినిమాలు చేసి మూడూ హిట్లు ఇచ్చాడు. ఇక అల వైకుంఠ‌పురంలో సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్‌కు తిరుగులేకుండా పోయింది. త్రివిక్ర‌మ్ నెక్ట్స్ సినిమా ఎన్టీఆర్‌తోనే క‌న్పార్మ్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ అయిన వెంట‌నే ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది.

ఈ లోగా చిరు ఆచార్య కూడా కంప్లీట్ చేసుకుంటే చిరు – త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా చిరు త‌న‌యుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మించ‌నున్నారు. ఇక త్రివిక్ర‌మ్ చిరుకు చెప్పిన లైన్ ఇదే అని కూడా మెగా కాంపౌండ్ వ‌ర్గాల పీఆర్ టీం నుంచి బ‌య‌ట‌కు లీక్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ చిరుకు చెప్పిన లైన్‌మీదే వ‌ర్క్ చేస్తున్నాడ‌ని అంటున్నారు.

ఈ సినిమా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌గా ఉంటుంద‌ని… సినిమాలో దొంగ స్వామిజీల మీద ఓ మెసేజ్ కూడా ఉంటుంద‌ని చెపుతున్నారు. ఇక త్రివిక్ర‌మ్ స్టైల్లో ప‌క్కా ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా పుష్క‌లంగానే ఉంటుంద‌ట‌. ఏదేమైనా త్రివిక్ర‌మ్ – మెగాస్టార్ కాంబినేష‌న్ రావ‌డం లేట్ అవ్వొచ్చేమో గాని.. రావ‌డం అయితే ప‌క్కా అన్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news