ర‌వితేజ కొత్త సినిమాకు అదిరిపోయే మాస్ టైటిల్‌… బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కా

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ గ‌త కొంత కాలంగా త‌న స్థాయికి త‌గిన హిట్ లేక రేసులో పూర్తిగా వెన‌క‌ప‌డిపోయారు. ఒక‌ప్పుడు ర‌వితేజ సినిమా వ‌స్తుందంటే భారీ అంచ‌నాలు ఉండేవి. బ‌య్య‌ర్లు పోటీ ప‌డి మ‌రీ రైట్స్ కొనేవారు. ఇప్పుడు ర‌వితేజ సినిమా వ‌స్తుందంటేనే ఎవ్వ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. ర‌వితేజ మార్కెట్ పూర్తిగా ప‌డిపోయింది. ర‌వితేజ మాస్ ప్రేక్ష‌కుల్లో మంచి ఇమేజ్ తెచ్చుకోవడంతో అత‌డికి మాస్ మ‌హ‌రాజ్ ముద్ర ప‌డిపోయింది. ఇక డిస్కోరాజా త‌ర్వాత ర‌వితేజ వ‌రుస పెట్టి సినిమాలు ఓకే చేస్తున్నాడు.

 

ఇక ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ న‌టించే సినిమా క‌రోనా నేప‌థ్యంలో ఇంకా సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తున్నార‌ట‌. రాశీఖ‌న్నా, నిధి అగ‌ర్వాల్ అని వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాగే అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ప‌క్కా మాస్ టైటిల్‌ను ఈ సినిమాకు ఖ‌రారు చేసినట్టు తెలుస్తోంది. ఖిలాడీ అనే ఊర‌మాస్ టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేశార‌ని అంటున్నారు. ఈ మాస్ టైటిల్‌తో దుమ్ము రేగ‌డం ఖాయ‌మే అని… సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొడుతుంద‌ని అంటున్నారు.

Leave a comment