స‌ర్కారు వారి పాట‌కు బిగ్ షాక్‌… ఆయ‌న్ను త‌ప్పించేశారా…!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఈ సంక్రాంతికి వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించే సినిమా స‌ర్కారు వారి పాట సినిమాకు ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ప‌ర‌శురాం చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ తొలిసారి జోడీ క‌ట్ట‌నుంది. ఈ సినిమా టైటిల్‌కు, ప్రి లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

 

ఇక తాజాగా మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా నుంచి ఓ కీల‌క టెక్నీషియ‌న్ అవుట్ అవ్వ‌డ‌మే ఇప్పుడు షాకింగ్‌గా మారింది. ఫస్ట్.. టైటిల్, ప్రి లుక్ విడుదల చేసినప్పుడు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ అని ప్రకటించారు. మోషన్ పోస్టర్‌లో మాత్రం మ‌ది అని ప్రకటించారు. మ‌ది గ‌తంలో మ‌హేష్‌తో శ్రీమంతుడు, ప్ర‌భాస్‌తో సాహోకు ప‌నిచేశాడు. ఇప్పుడు పీఎస్‌. వినోద్ త‌ప్పుకోవడంతో స‌ర్కారు వారి పాట సినిమాటోగ్ర‌ఫీ ఛాన్స్ కూడా మ‌దినే వరించింది. వినోద్ డేట్లు స‌ర్దుబాటు చేయ‌లేకే త‌ప్పుకున్నాడ‌ని కొంద‌రు అంటంటే.. మ‌రి కొంద‌రు కావాల‌నే త‌ప్పించార‌ని అంటున్నారు. మ‌రి అస‌లు వాస్త‌వం ఏంటో ? చూడాలి.

Leave a comment