నంద‌మూరి ఫ్యాన్స్‌కు సూప‌ర్ న్యూస్‌… బాల‌య్య కొత్త సినిమా అప్‌డేట్ వ‌చ్చేసింది..

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ ఈ పేరు గురించి ఇండస్ట్రీలో పెద్దగా చెప్పనవసరం లేదు. నందమూరి తారక రామారావు తర్వాత ఆ ఇంటినుంచి వచ్చిన హీరోలలో అంతటి పేరు తెచ్చుకున్న వ్యకి బాలకృష్ణ. బాల‌య్య మూడు వ‌రుస ప్లాపుల త‌ర్వాత ప్ర‌స్తుతం బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య – బోయ‌పాటి కాంబినేష‌న్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు వీరిద్ద‌రి కాంబోలో రాబోతోన్న సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

 

ఇప్ప‌టికే ‘బీబీ3′ పేరుతో విడుద‌ల‌ చేసిన టీజ‌ర్ ఇప్ప‌టికే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అయితే రెండు క్యారెక్టర్ల మధ్య నడిచే వార్ ఆదారంగా ఈ సినిమా ప్లే ఉంటుందని తెలుస్తోంది. హీరో, విల‌న్ క్యారెక్ట‌ర్ల మ‌ధ్య న‌డిచే స‌స్పెన్స్ డ్రామాను బోయ‌పాటి త‌న‌దైన మ్యాజిక్‌తో తెర‌కెక్కిస్తార‌ని ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 

సెకండాఫ్‌లో అస‌లు విల‌న్ ఎవ‌రు ? అనే కోణంలో న‌డిచే స‌స్పెన్స్ సినిమాకే సూప‌ర్ హైలెట్ అంటున్నారు. బాల‌య్య‌కు ఇప్ప‌టికే సింహా, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు ఇచ్చిన బోయ‌పాటి ఈ సినిమాతో మంచి హ్యాట్రిక్ హిట్ ఇస్తాడ‌ని అంటున్నారు. బాల‌య్య వ‌రుస ప్లాపుల‌తో ఉండ‌డంతో ఈ సారి త‌న‌కు లెజెండ్‌ను మించిన హిట్ ప‌డాల‌న్న క‌సితో ఉన్నాడ‌ట‌. మ‌రి లాక్‌డౌన్ నేప‌థ్యంలో సినిమా షూటింగ్ వాయిదా ప‌డినా వ‌చ్చే యేడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

Leave a comment