Gossipsఅఖిల్ హీరోయిన్ ల‌వ్‌స్టోరీయే... రీల్ లైఫ్ ల‌వ్ స్టోరీ అయ్యిందిగా...!

అఖిల్ హీరోయిన్ ల‌వ్‌స్టోరీయే… రీల్ లైఫ్ ల‌వ్ స్టోరీ అయ్యిందిగా…!

అఖిల్ హ‌లో సినిమాలో న‌టించిన హీరోయిన్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని ప్రేమ పెళ్లికి రెడీ అవుతోంద‌ట‌. హలో సినిమాలో చిన్నప్పటి స్నేహమే వయసుతో పాటు పెరిగి వారిలో ప్రేమగా మారుతుంది. ఇదే స్టోరీ కళ్యాణి జీవితంలో కూడా ఉందన్న వార్త‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. మ‌ళ‌యాళ డైరెక్ట‌ర్ ప్రియ‌ద‌ర్శ‌న్ , మోహ‌న్‌లాల్ మంచి ఫ్రెండ్స్‌. ఇక వీరి భార్య‌లు అయిన లిజీ, సుచిత్ర మోహ‌న్‌లాల్ కూడా ఫ్రెండ్సే. వీరి స్నేహం నేప‌థ్యంలో వీరి పిల్ల‌లు అయిన క‌ళ్యాణి, ప్ర‌ణ‌వ్ మోహ‌న్‌లాల్ కూడా చిన్న‌ప్ప‌టి నుంచే క‌లిసి మెలిసి పెరిగారు.

 

వీరి వ‌య‌స్సుతో పాటు స్నేహం, ప్రేమ కూడా పెరిగాయ‌న్న గాసిప్‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. వీరి స్నేహం.. ప్రేమ‌పై ఇప్పుడు మ‌ల్లూవుడ్‌లో ఒక్క‌టే టాపిక్ న‌డుస్తోంది. తాజాగా వీరి రిలేష‌న్‌షిప్‌పై మాట్లాడారు. ప్ర‌ణ‌వ్ – క‌ళ్యాణి కూడా తాను, ప్రియ‌ద‌ర్శ‌న్‌లాగే మంచి స్నేహితులు అని… అంత మాత్రాన వీరి మ‌ధ్య ఏదో సంబంధం ఉంద‌ని ఎలా అర్థం చేసుకుంటార‌ని ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల‌ కళ్యాణి ప్రియదర్శన్ ప్రణవ్ బర్త్ డే నాడు వాళ్లిద్దరూ దిగిన చిన్నప్పటి ఫోటో షేర్ చేస్తూ అతడికి విషెస్ చెప్పింది.

 

నువ్వు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌వు.. ఇది చూడ‌వ‌ని నాకు తెలుసు.. కానీ నువ్వు ప్ర‌ణ‌వ్‌కు ఎందుకు విషెస్ చెప్ప‌లేద‌ని ప్ర‌శ్నించే వారికోసం ఇది పెడుతున్నా అంటూ చ‌మ‌త్కారం చేసింది. అలాగే బ్యాడ్‌ల‌క్ ఏంటంటే మ‌నం చాలా తెలివైన వాళ్లం అయ్యాము.. చిన్న‌ప్ప‌టి రోజుల‌కు వెళితే బాగుంటుంద‌ని అనుకుంటున్నాను… నీతో క‌లిసి షూటింగ్ చేసే టైం కోసం వెయిట్ చేస్తున్నా అని పోస్ట్ చేసింది. ఇక వీరిద్ద‌రి పెళ్లిపై రెండు కుటుంబాల నుంచి కూడా సానుకూల సంకేతాలే ఉన్నాయ‌ని.. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news