Gossipsసుశాంత్ రాజ్‌పుత్ సినిమాకు వన్ అరేంజ్డ్ మర్డర్ టైటిల్ ఫిక్స్ చేశారా...!

సుశాంత్ రాజ్‌పుత్ సినిమాకు వన్ అరేంజ్డ్ మర్డర్ టైటిల్ ఫిక్స్ చేశారా…!

చేత‌న్ భ‌గ‌త్ భార‌త‌దేశంలో ఉన్న వారిలో ప్ర‌ముఖ న‌వ‌లా ర‌చ‌యిత‌. కాల‌మిస్టు.. బెస్ట్ స్క్రీన్ ప్లే రైట‌ర్ అయిన ఆయ‌న ఎన్నో మంచి క‌థ‌ల ద్వారా దేశంలో ఎంతో మంది యువ‌త‌కు ప్రేర‌ణ అయ్యాడు. చేత‌న్ న‌వ‌ల ఆథారంగానే అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ సినిమా తీసి సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టాడు. చేత‌న్ బాలీవుడ్‌లో ప‌లు సినిమాల‌కు ఉత్త‌మ స్క్రీన్ ప్లే రైట‌ర్ అవార్డు సొంతం చేసుకున్నారు. చేత‌న్ క‌థ‌ల‌తో పాటు నేష‌న‌ల్ ప‌త్రిక‌లు అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా, దైనిక్ భాస్కర్ వంటి పత్రికలలో కాలమ్స్ రాస్తుంటారు. ఆంగ్లంలో ఈయన రాసిన నవలలు పుస్తకాలు యువతకు చాలా చేరువయ్యాయి. దేశంలోనే ప్రముఖ రైటర్ గా ఈయనకు పేరుంది.

 

తాజాగా చేతన్ భగత్ ఓ పుస్తకం రాస్తున్నారనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆయ‌న కూడా వన్ అరేంజ్డ్ మర్డర్ అనే పేరుతో పుస్తకం రాస్తున్న‌ట్టు చెప్పారు. త‌న కొత్త పుస్తకం కవర్ ను విడుదల చేస్తానని ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. ఆయ‌న రాసే క‌థ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితం ఆధారంగా తెర‌కెక్కే సినిమా కోస‌మే అని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలోనే చేతన్ భగత్ ఈ పుస్తకం రాస్తున్నారని అంటున్నారు. మ‌రి చేత‌న్ ఈ రోజు ఏం ట్విస్ట్ ఇస్తారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news