ప‌వ‌న్ ‘ గ‌బ్బ‌ర్‌సింగ్ 2 ‘ ఎక్స్‌క్లూజివ్‌ డీటైల్స్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌కీల్‌సాబ్ మూవీతో పాటు క్రిష్ మూవీ చేస్తున్నాడు. అప్పుడెప్పుడో ఎన్నిక‌ల‌కు ముందు యేడాది త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో ప‌వ‌న్ చేసిన అజ్ఞాత‌వాసి డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత పూర్తిగా రాజ‌కీయాల్లోకి వెళ్లిన ప‌వ‌న్ ఇప్పుడు మ‌ళ్లీ వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. వ‌కీల్‌సాబ్ బాలీవుడ్ సినిమాకు రీమేక్‌. ఇక క్రిష్ డైరెక్ట్ చేసే సినిమా పీరియాడిక‌ల్ మూవీ అంటున్నారు. ఇది భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కే సినిమా అని టాక్‌. ఈ రెండు సినిమాల‌లో క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌కు పెద్ద‌గా స్కోప్ ఉండ‌ద‌ని… అయితే ఆ త‌ర్వాత చేసే సినిమా మాత్రం ప‌వ‌న్ ఫ్యాన్స్ ర‌చ్చ రంబోలా చేసుకునేలా ఉండ‌బోతోంది.

 

ఆ సినిమాయే గ‌బ్బ‌ర్‌సింగ్‌కు సీక్వెల్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ – హ‌రీష్ శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌కు ఊపిరి లూదింది. ఆ సినిమా త‌ర్వాతే ప‌వ‌న్‌కు అత్తారింటికి దారేది రూపంలో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌చ్చింది. అయితే ఇప్పుడు అదే గ‌బ్బ‌ర్‌సింగ్‌కు సీక్వెల్ రాబోతోంద‌ట‌. నాడు గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా కోసం బాలీవుడ్‌లో స‌ల్మాన్‌ఖాన్ చేసిన ద‌బాంగ్ సినిమాను రీమేక్ చేసిన హ‌రీష్ ఇప్పుడు మాత్రం అదే పోలీస్ క్యారెక్ట‌ర్‌తో మాస్ అంశాలు ఎలివేట్ చేస్తూ మాంచి స్టోరీ రెడీ చేశాడ‌ని తెలుస్తోంది.

 

ఈ క‌థ ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు పంచ‌భ‌క్ష ప‌ర‌మాన్నాలు అందిస్తుంద‌న్న కూడా మైత్రీ మూవీ మేక‌ర్స్ కాంపౌండ్‌ ద్వారా స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. పవన్ సరసన ఒక స్టార్ హీరోయిన్ జతకట్టనున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. మ‌రి గ‌బ్బ‌ర్‌సింగ్ 2 థియేట‌ర్ల‌లో ఎలా ర‌చ్చ చేస్తాడో ? చూసేందుకు యేడాదికి పైగా టైం ప‌ట్ట‌నుంది.

Leave a comment