బిగ్‌బాస్ 4 లో సింగ‌ర్ నోయల్‌.. జానీ మాస్ట‌ర్‌… టాప్ మ‌హిళా సెల‌బ్రిటీలు కూడా…!

తెలుగు బుల్లితెర రియాల్టీ పాపుల‌ర్ షో బిగ్‌బాస్ 4 సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. మూడో సీజ‌న్‌కు హోస్ట్‌గా ఉన్న నాగార్జున ఇప్పుడు నాలుగో సీజ‌న్‌కు సైతం హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ నాలుగో సీజ‌న్‌కు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో అనేక నిబంధ‌న‌ల మ‌ధ్య బిగ్ బాస్ -4వ సీజ‌న్‌ను నిర్వ‌హించేందుకు ప‌క్కాగా ఏర్పాట్లు జ‌రుగుతున్న‌నాయి. ఈ షో లేట్‌గా స్టార్ట్ అయినా కూడా లేటెస్ట్‌గానే ఉండాల‌ని నాగార్జున భావిస్తున్నాడ‌ట‌.

 

ఈ క్ర‌మంలోనే ముందుగా షోలో పాల్గొనే కంటెస్టెంట్ల‌కు క్వారంటైన్ టెస్టులు చేయించి 14 రోజుల పాటు వారిని క్వారంటైన్‌లో ఉంచి.. మ‌రోసారి టెస్టులు చేయించాకే షోలోకి తీసుకోనున్నార‌ట‌. ఇక షోకు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. సీజన్ 4 లో ఓ సింగర్, డాన్స్ మాస్టర్ పాల్గొంటున్నారు అని తెలుస్తోంది. సింగర్ నోయ‌ల్ తో పాటు ప్రముఖ డాన్సర్ జానీ మాస్టర్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్‌. ఇక వీరితో పాటు మ‌రో న‌లుగురు మ‌హిళా సెల‌బ్రిటీలు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్టు అన‌ధికారిక వార్త‌లు వ‌స్తున్నాయి.

Leave a comment