మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జల్సా సినిమాలో రెండో హీరోయిన్ నటించింది పార్వతీ మెల్టన్. ఆ తర్వాత మహేష్‌బాబు దూకుడు సినిమాలో పువ్వాయ్ సాంగ్‌లో నటించి మరోసారి తెలుగు కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా అవి ప్లాప్ కావడంతో ఎక్కువ కాలం ఇక్కడ హీరోయిన్‌గా నిలదొక్కుకోలేదు. ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకుని ఎంచక్కా తన ఫ్యామిలీ లైఫ్ అమెరికాలో ఎంజాయ్ చేస్తోంది.
ఈ క్రమంలోనే ఆమె తాను సినిమా పరిశ్రమలో ఎదుర్కోన్న ఇబ్బందుల గురించి తాజాగా స్పందించింది. తాను టాలీవుడ్‌కు చెందిన ఓ దర్శకుడి వల్లే ఇండస్ట్రీలోకి వచ్చానని.. అయితే ఇక్కడ ఓ టాప్ దర్శకుడితో పాటు మరో టాప్ హీరో చేసిన మోసం వల్లే తన సినిమా కెరీర్ నాశనం అయ్యిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేసినా వారిద్దరి పేర్లు బయట పెట్టేందుకు మాత్రం ఇష్టపడ లేదు.
ప్రస్తుతం తన భర్తతో కలిసి తన ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. చివరగా ఆమె సాయిరాం శంకర్ నటించిన యమహో యమః సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో నటించలేదు.