Politicsక‌రోనా గురించి మ‌రో భ‌యంక‌ర నిజం... 73 రూపాల్లో వైర‌స్...!

క‌రోనా గురించి మ‌రో భ‌యంక‌ర నిజం… 73 రూపాల్లో వైర‌స్…!

ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా గురించి మ‌రో భ‌యంక‌ర‌మైన నిజం బ‌య‌ట‌కు వ‌చ్చింది. రోజు రోజుకు ఈ వైర‌స్ గురించి ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఢిల్లీలోని సిఎస్ఐఆర్-ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజిఐబి) తోపాటు భువనేశ్వర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరోనా వైరస్ రూపాల గురించి చేసిన ర‌క‌ర‌కాల ప‌రిశోధ‌న‌ల్లో భ‌యంక‌ర నిజాలు వెల్ల‌డ‌య్యాయి. క‌రోనా వైర‌స్ జాతిలో మొత్తం 73 రూపాలు ఉన్న‌ట్టు వీరు గుర్తించారు.

 

ఈ ప‌రిశోధ‌న‌ల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన డాక్ట‌ర్ జ‌య‌శంక‌ర్ దాస్ మొత్తం 752 క్లినికల్ శాంపిల్స్‌తో సహా 1,536 నమూనాలను పరిశీలించారు. ఈ ప‌రిశీల‌న‌లో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. క‌రోనా జాతిలో బి 1.112, బి 1 అనే రెండు వంశాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ ప‌రిశోధ‌నల సారాంశాన్ని వీరు ఆన్‌లైన్‌లో ఉంచారు. ఇక వైర‌స్ బ‌ల‌హీన‌త‌ల‌ను గుర్తిస్తే చాల‌ని.. దానికి విరుగుడు క‌నుక్కోవ‌డం సులువు అవుతుంద‌ని కూడా శాస్త్ర‌వేత్త‌లు చెపుతున్నారు.

 

ఏదేమైనా క‌రోనా గురించి వెలుగు చూస్తోన్న రోజుకో వార్త‌ల క్ర‌మంలో ఇప్పుడు ఈ స‌రికొత్త వార్త కూడా వెలుగులోకి వ‌చ్చింది. ఇక దేశంలో క‌రోనా కేసులు ఇప్ప‌టికే 25 ల‌క్ష‌లు దాటేశాయి. ఏపీలో ప్రతిరోజూ 9,000కు అటూఇటుగా కేసులు నమోదవుతూ ఉండగా తెలంగాణలో గత కొన్ని రోజులుగా 2,000 లోపే కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ నియంత్రించటం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news