ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, రాజ్యసభ్యుడు మోపిదేవి వెంటకరమణ ప్రయాణిస్తోన్న కారు విశాఖపట్నం జిల్లాలో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. వీరు ప్రయాణిస్తోన్న కారు విశాఖ జిల్లాలోని కశీంకోట మండలం తాళ్లపాలెం హైవేపై వెళుతుండగా… వీరి కాన్వాయ్ మధ్యలోకి మరో ప్రైవేటు వాహనం చొరబడింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రైవేటు వాహనాన్ని మోపిదేవి కారు బలంగా డీకొంది. వెనక నుంచి మరో కారు కూడా మోపిదేవి కారును ఢీకొట్టింది.
ఇలా మూడుకార్లు వరుసగా ఢీకొట్టుకోవడంతో మోపిదేవి కారు స్వల్పంగా ధ్వంసమైంది. ఘటన అనంతరం వేరొక కారులో ఇరువురు నేతలు విశాఖకు వెళ్లిపోయారు. పుష్పశ్రీవాణి, మోపిదేవికి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.