బ్రేకింగ్‌: శ్రీశైలం ప్ర‌మాదంలో ఆరు మృత‌దేహాలు ల‌భ్యం

నాగ‌ర్‌క‌ర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు మృత‌దేహాలు ల‌భ్యం అయ్యాయి. ఇక స్థానికులు చెపుతున్న దాని ప్ర‌కారం విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు 25 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 15 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు.

ఒక్క‌సారిగా పేలుడుతో భారీ శ‌బ్దం వ‌చ్చింది. అయితే ఫైర్ ఎలా జ‌రిగింది ? అన్న దానిపై మాత్రం క్లారిటీ లేద‌ని అక్క‌డ ఉన్న‌వాళ్లు చెపుతున్నారు. ఎడ‌మ‌గ‌ట్టు విద్యుత్ కేంద్రంలో మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల‌తో పాటు ఇద్ద‌రు అమ్రాన్ కంపెనీ సిబ్బంది కూడా గ‌ల్లంతైన వారిలో ఉన్నారు. ఇక మ‌రో మూడు మృత‌దేహాల కోసం అన్వేష‌ణ కొన‌సాగుతోంది.

Leave a comment