ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ రెమ్యున‌రేష‌న్లు ఈ రేంజ్‌లోనా… క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే..!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబోలో వ‌స్తోన్న సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు పెద్ద గ్యాప్ లేకుండానే వీరు మ‌రోసారి జోడీ క‌డుతున్నారు. ఇక అర‌వింద స‌మేత‌ను త్రివిక్ర‌మ్ త‌న‌స్టైల్‌కు భిన్నంగా తీశారు. అయితే ఇప్పుడు తీసే సినిమాను మాత్రం త‌న‌దైన స్టైల్లో ఫ్యామిలీ, కామెడీ, సెంటిమెంట్ అన్ని మేళ‌వించి తీయ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

 

ఈ సినిమా కోసం భారీ బ‌డ్జెట్ కేటాయించార‌ట‌. ఎన్టీఆర్‌కు రు. 40 కోట్లు, త్రివిక్ర‌మ్‌కు రు. 20 కోట్ల‌తో పాటు లాభాల్లో ఎంతో కొంత వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరింద‌ని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ చేసే సినిమా కావ‌డంతో ఆర్ ఆర్ ఆర్ రేంజ్‌ను బ‌ట్టి ఎన్టీఆర్‌కు రెమ్యున‌రేష‌న్ ఉండాల‌ని నిర్మాత‌లు ముందుగానే ఫిక్స్ అయ్యార‌ట‌. అందుకే ఎన్టీఆర్‌తో పాటు త్రివిక్ర‌మ్ ఇద్ద‌రికి భారీ రెమ్యున‌రేష‌న్లు ఉండేలా ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది.

 

ఎన్టీఆర్ ఐదు వ‌రుస హిట్ల‌తో పాటు ఆర్ ఆర్ ఆర్ చేస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. అటు త్రివిక్ర‌మ్ అల వైకుంట‌పురం సినిమాతో తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఈ సినిమాపై అంచ‌నాలు తారాస్థాయిలో ఉన్నాయి.

Leave a comment