కొర‌టాల కొత్త రేటు చూస్తే చుక్క‌ల్లోనే… ఇంత భారీగా పెంచేశాడేంటి…!

టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో మాట‌ల ర‌చ‌యిత‌గా ఉన్న కొర‌టాల ఇప్పుడు నాలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌తో త‌క్కువ టైంలోనే తిరుగులేని ద‌ర్శ‌కుడు అయ్యాడు. మ‌హేష్‌బాబుతో తీసిన భ‌ర‌త్ అనే నేను సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న కొర‌టాల ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరుతో ఆచార్య సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కోవిడ్ నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది.

 

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న డైరెక్టర్లలో కొరటాల కూడా ఒకరు అనే టాక్ ఉంది. మిర్చి సినిమా తరువాత శ్రీమంతుడు సినిమాతో రెమ్యునరేషన్ భారీగా పెంచ‌గా.. అప్ప‌టి నుంచి ప్ర‌తి సినిమాకు కొర‌టాల రెమ్యున‌రేష‌న్ పెంచేస్తున్నాడ‌ట‌. ఆచార్య సినిమాకు రెమ్యున‌రేష‌న్ కాకుండా సినిమాకు జ‌రిగిన బిజినెస్‌ను బ‌ట్టి వాటా తీసుకునేలా నిర్మాత రామ్‌చ‌ర‌ణ్‌తో ముందే ఒప్పందం చేసుకున్నాడ‌ట‌.

 

ఇక ఈ సినిమా త‌ర్వాత స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేసే సినిమా కోసం కూడా భారీ గానే రెమ్యున‌రేష‌న్‌ తీసుకోవచ్చనే ఊహాగానాలూ ఉన్నాయి. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన వెంట‌నే బ‌న్నీ – కొర‌టాల సినిమా ప్రారంభం కానుంది. ఏదేమైనా కొర‌టాల తాజా రెమ్యున‌రేష‌న్ ఎలాగైనా రు.20 – 22 కోట్ల‌కు కాస్త అటూ ఇటూగా ఉంటుంద‌ని ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్‌..?

Leave a comment