నిహారిక ఎంగేజ్మెంట్‌కు ప‌వ‌న్ డుమ్మా… ఈ రీజ‌న్ నిజ‌మేనా..!

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక ఎంగేజ్మెంట్ కి బంధువులంతా తరలివచ్చారు. ఎంత క‌రోనా ఆంక్ష‌లు ఉన్నా మెగా, నాగ‌బాబు, అల్లు అర‌వింద్ ఫ్యామిలీల‌తో పాటు అటు పెళ్లి కుమారుడు కుటుంబ స‌భ్యులు , బంధువులు హాజ‌ర‌య్యారు. అంద‌రూ వ‌చ్చినా నిహారిక బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం రాలేదు. ఇదే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ప‌వ‌న్ చాతుర్మాస దీక్ష‌లో ఉండ‌డంతో రాలేద‌ని కొంద‌రు అంటుంటే.. మ‌రి కొంద‌రు మాత్రం ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉండి రాలేద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

 

ఎంత బిజీగా ఉన్నా అన్న కుమార్తె పెళ్లికి అంద‌రూ వ‌చ్చార‌ని.. ప‌వ‌న్ రాక‌పోవ‌డం పెద్ద లోటే అని కొంద‌రు అంటున్నారు. పోనీ పవన్ ఈమధ్య పంక్షన్లకు అటెండ్ కావడంలేదా అంటే అదీ లేదు. నితిన్ పెళ్లికి పవన్ ముఖ్య అతిథిగా వెళ్లారు. చాతుర్మాస దీక్షలో ఉండి కూడా, అవే దుస్తులతో పవన్ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించి వచ్చారు. అలాంటి పవన్ నిహారిక ఎంగేజ్మెంట్ కి ఎందుకు రాలేదు ? దీనిపై ర‌క‌ర‌కాల సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

సోష‌ల్ మీడియాలో కొంద‌రు మాత్రం ప‌వ‌న్ కావాల‌నే నిహారిక ఎంగేజ్మెంట్‌కు రాలేద‌ని.. మెగా ఫ్యామిలీలో ఉన్న గ్యాప్ కార‌ణంగానే ప‌వ‌న్ ఈ కార్య‌క్ర‌మానికి రాలేదంటున్నారు. కార‌ణం ఏదైనా ప‌వ‌న్ ఈ ఎంగేజ్మెంట్‌కు డుమ్మా కొట్ట‌డంతో మ‌ళ్లీ అనేక సందేహాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. మెగా ఫ్యాన్స్ మాత్రం ప‌వ‌న్ ముందుగానే ఈ కార్యక్రమానికి రాలేనని, పెళ్లికి కచ్చితంగా వస్తానని, తన శుభాకాంక్షలు ఫోన్ ద్వారా తెలిపారట.

Leave a comment