టాలీవుడ్ నటుడు, దగ్గుబాటి రానా ఇటీవల ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. రానా ముంబైకు చెందిన మిహీకా బజాజ్ ఇటీవల ఓ ఇంటి వాళ్లు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో చాలా సింపుల్‌గా వీరి పెళ్లి జరిగినా కూడా కొత్త జంట వైవాహిక బంధాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మిహీకా తన భర్త రానా గురించి ఓ కవితాత్మక సందేశాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
రానాతో కలిసున్న ఫొటోకు క్యాప్షన్‌గా మై లవ్.. మై లైఫ్.. మై హార్ట్… మై సోల్.. నా సర్వస్వం నువ్వే… అయినందుకు ధన్యవాదాలు… నువ్వు నన్ను మరింత ఉన్నతమైన వ్యక్తిగా మార్చావు.. నా కల ఇంత త్వరగా నిజం అవుతుందని అనుకోలేదు.. ఐ లవ్ యూ అంటూ మిహీకా పేర్కొన్నారు. మిహీకా బజాజ్ రానా గురించి పెట్టిన ఈ పోస్టుకు సమంత, వెంకటేష్ కుమార్తె అశ్రిత, బంటి బజాజ్ స్పందించడంతో పాటు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఏదేమైనా రానాపై మిహీకా మెసేజ్ కేక పెట్టించడంతో పాటు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.