Politicsఏబ్సెలిన్‌తో క‌రోనాకు ఇలా చెక్ పెట్టొచ్చా... !

ఏబ్సెలిన్‌తో క‌రోనాకు ఇలా చెక్ పెట్టొచ్చా… !

ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనాను కంట్రోల్ చేసేందుకు విస్తృతంగా ప్ర‌యోగాలు, ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. అనేక వ్యాక్సిన్లు, మందులు వ‌స్తున్నాయ‌న్న ప్ర‌చారం అయితే ఉంది. ఈ క్ర‌మంలోనే ఏబెలిన్స్ ఔషధం కరోనా కట్టడిలో సాయపడుతున్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. క‌రోనా సోకిన వారికి అనేక వినికిడి స‌మ‌స్య‌లు, మానసిక ఒత్తిళ్ల‌ను దూరం చేసేందుకు ఈ ఔష‌ధం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కూడా శాస్త్ర‌వేత్త‌లు చెపుతున్నారు. అమెరికాలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ షికాగో శాస్త్ర‌వేత్త‌లు ఏబ్సెలిన్ ఔషధం ఎంజైమ్ ల వృద్ధిని కట్టడి చేయడంలో అద్భుతంగా పని చేస్తుందని తేల్చామని స్ప‌ష్టం చేశారు.

 

ఇక ఈ ఎబ్సెలిన్ రెండు విధాలుగా క‌రోనా అణువుల్లోని ఎం-ప్రో వంటి ఎంజైమ్‌ల వృద్ధిని అడ్డుకుంటున్నట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏబ్సెలిన్‌ ఎంజైమ్‌లోని క్యాటలిటిక్‌ను సైతం విస్త‌రించ‌కుండా క‌ట్ట‌డి చేస్తోంద‌ట‌. ఇక ఈ ఏబ్సెలిన్ మ‌నుష్యుల‌పై ఎలాంటి దుష్ప్ర‌భావాలు కూడా క‌లిగించ‌బోద‌ని కూడా ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన జువాన్‌ ది పాబ్లో అనే శాస్త్రవేత్త చెపుతున్నారు. ఇక ఈ నెల 11న ర‌ష్యా క‌రోనా వ్యాక్సిన్ రిలీజ్ చేసింది. ఫైన‌ల్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌కుండానే శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ విడుదల చేశారు. దీంతో శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ విషయంలో అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news