హాట్ టాపిక్‌గా చిరంజీవి రెమ్యున‌రేష‌న్‌…. వామ్మో అన్ని కోట్లా… బిజినెస్ ఏ రేంజ్‌లోనో…!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. చిరు త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ త‌న సొంత బ్యాన‌ర్ అయిన కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు మ్యాట్నీ ఎంట‌ర్టైన్‌మెంట్ సంస్థ‌లు క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సైరా త‌ర్వాత చిరంజీవి న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో పాటు భ‌ర‌త్ అనేనేను లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని కొర‌టాల డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాలో చిరంజీవితో పాటు చ‌ర‌ణ్ కూడా స్పెష‌ల్ రోల్లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. చిరు ప‌క్క‌న చంద‌మామ కాజ‌ల్‌, చెర్రీ ప‌క్క‌న కైరా అద్వానీ హీరోయిన్లు.

 

ఇక ఈ సినిమా కోసం చిరంజీవి తీసుకుంటోన్న రెమ్యున‌రేష‌న్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాను చెర్రీయే నిర్మించినా రు. 25 కోట్ల‌కు పైమాటే ముట్టింద‌ని అంటున్నారు. ఇది ప‌దేళ్ల త‌ర్వాత చిరు చేసిన సినిమా. ఇప్పుడు సైరాతో చిరు మార్కెట్ మ‌రింత పెరిగింది. ఇప్పుడు ఆచార్య కోసం చిరుకు రెమ్యున‌రేష‌న్‌, బిజినెస్‌లో రైట్స్ అన్నీ క‌లుపుకుని ఏకంగా రు. 50 కోట్ల వ‌ర‌కు ముట్ట‌నుంద‌ని అంటున్నారు. ఇదే నిజ‌మైతే ఇది టాలీవుడ్‌లో ఓ రికార్డుగానే చెప్పాలి.

 

ప్ర‌భాస్ రెమ్యునరేష‌న్ త‌ర్వాత చిరుదే హ‌య్య‌స్ట్ అవుతుంది. కొంత రెమ్యున‌రేష‌న్‌తో పాటు బిజినెస్‌లో వాటా లేదా రెండే ఏరియాల రైట్స్ తీసుకుంటార‌ని తెలుస్తోంది. సినిమా ఖ‌ర్చంతా నిరంజన్ రెడ్డితో పెట్టించి రిలీజ్ మాత్రం కొణిదెల ప్రొడక్షన్స్ ద్వారా గీతా డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక కొణిదెల బ్యాన‌ర్ లేదా బ‌యట బ్యాన‌ర్ల‌లో చేసే సినిమాల‌కు రెమ్యున‌రేష‌న్ మాత్రం ఏరియాల రైట్స్ రూపంలోనే తీసుకోనున్నాడ‌ని తెలుస్తోంది.

Leave a comment