రియా ఫోన్ కాల్‌ లిస్ట్‌లో సంచ‌ల‌నం… రానా, ర‌కుల్‌తో ఫోన్ సంభాష‌ణ‌లు… సెల‌బ్రిటీల లిస్ట్ ఇదే

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విచారణ గ‌డుస్తోన్న కొద్ది అనేక మ‌లుపులు తిరుగుతోంది. ఈ కేసులో అనేక సంచ‌ల‌న విష‌యాలు కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ కేసును ప్ర‌స్తుతం సీబీఐ, ఈడీలో విచారిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేర‌కు సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన పోలీసులు విచారిస్తున్నార‌ను. ఈ క్ర‌మంలోనే ఓ జాతీయ మీడియా ఛానెల్ రియా ఫోన్ కాల్ లిస్ట్ లీక్ చేసింది. ఈ లిస్టులో ఆమె ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రిటీలతో రియా చక్రవర్తి టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

 

వ‌స్తోన్న పుకార్ల‌ను బ‌ట్టి చూస్తే రియా మ‌న టాలీవుడ్ హీరో రానాతో, హీరోయిన్ ర‌కుల్‌తో కూడా పలు సార్లు ఫోన్లో మాట్లాడిన‌ట్టు వెల్ల‌డైంద‌ట‌. ర‌కుల్‌కు రియా 30 సార్లు కాల్ చేయగా.. రకుల్ ఆమెకు 14 సార్లు కాల్ చేసింది. వీరి మధ్య గంట‌ల త‌ర‌బ‌డి చాటింగ్ కూడా జ‌రిగింద‌ని అంటున్నారు. ఇక రానాకు కూడా రియా 7 సార్లు కాల్ చేయడా.. రానా 4 సార్లు ఆమెకు కాల్ చేసినట్లు వెల్లడించింది. అమీర్ ఖాన్ కి రియా మూడు మెసేజులు చేసినట్లు తెలిపింది.

 

ఇక మిగిలిన సెల‌బ్రిటీల్లో ఆషిఖీ 2 హీరో ఆదిత్య రాయ్ కపూర్ కి ఆమె 16 సార్లు కాల్ చేయగా.. అతను రియాకి 7 సార్లు కాల్ చేసినట్లు తెలిసింది. ఇక సాహో హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్‌కు రియా మూడు సార్లు కాల్ చేస్తే… శ్ర‌ద్ధా కూడా రియాకు ఇటీవ‌లే రెండు సార్లు కాల్ చేసింద‌ట‌. ఇటీవల మరణించిన సరోజ్ ఖాన్ తో కూడా రియా చక్రవర్తి ఫోన్ లో సంభాషించినట్లు ఫోన్ కాల్ లిస్ట్ వెల్లడించింది. ఇక ఆమెకు ద‌ర్శ‌క‌, నిర్మాత మ‌హేష్ భ‌ట్‌కు ఉన్న లింకుల గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌హేష్‌తో ఆమె 16 సార్లు మాట్లాడిన‌ట్టు తేలింద‌ట‌.

Leave a comment