ఆ ఇద్ద‌రికి దిల్ రాజు దెబ్బ…. షాక్‌లో ఇండ‌స్ట్రీ…!

టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత దిల్ రాజు ఏ నిర్ణ‌యం తీసుకున్నా దాని వెన‌క ఆయ‌న లెక్క‌లు వేరేగానే ఉంటాయి. తాజాగా ఆయ‌న నాని, సుధీర్‌బాబు కాంబోలో మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన సినిమా వి. ఈ సినిమాను మంచి లైన్‌తో, మంచి టెక్నాల‌జీతో రూపొందించార‌ట‌. రు. 35 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చ‌య్యింద‌ని అంటున్నారు. ఈ సినిమాను థియేట‌ర్లో మాత్ర‌మే విడుద‌ల చేయాల‌న్న‌ది ద‌ర్శ‌కుడు మోహ‌న్‌కృష్ణ పంతం. అప్పుడెప్పుడో మార్చి 25న రిలీజ్ చేయాల‌నుకున్నారు.

 

క‌రోనా నేప‌థ్యంలో ఐదు నెల‌లుగా వి రిలీజ్ ఆగిపోయింది. దీంతో దిల్ రాజు దీనిని ఇలా పెట్టుకుని కూర్చుంటే వ‌డ్డీ న‌ష్టం భారీగా ఉంటుంద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేసి… ఓటిటికి ఇచ్చేయాలని డిసైడ్ అయినట్లు భోగట్టా. దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఇటు ఈ సినిమా థియేట‌ర్లోనే రిలీజ్ కావాల‌ని పంతంతో ఉన్న ద‌ర్శ‌కుడితో పాటు స్టార్ హీరోగా ఉన్న నానికి కూడా షాకే అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి.

 

అదే టైంలో థియేట‌ర్ల‌కు కూడా పెద్ద ఎదురు దెబ్బే అవుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా. ఏదేమైనా పెద్ద ఎగ్జిబిట‌ర్‌గా ఉన్న దిల్ రాజే ఇలా చేస్తే మిగిలిన చిన్నా చిత‌కా ఎగ్జిబిట‌ర్ల ప‌రిస్థితి ఏంట‌న్న ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి. రాజు నిర్ణ‌యంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కాస్త షాక్‌లోనే ఉన్నాయి.

Leave a comment