స్టార్ డైరెక్ట‌ర్‌పై సీనియ‌ర్ హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. తిట్టాడు.. బెదిరించాడు…

హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో అనేక చ‌ర్చ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ న‌టి మ‌హిమా చౌద‌రి సైతం స్టార్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సుభాష్ ఘ‌య్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప‌ర్దేశ్ డైరెక్ట్ చేసిన ఘాయ్ త‌న‌ను తిట్ట‌డంతో పాటు కోర్టుకు లాగుతాన‌ని బెదిరించాడ‌ని వాపోయింది. ఆ సమయంలో సంజయ్‌ దత్‌, సల్మాన్‌ ఖాన్‌లు తనకు మద్దతుగా నిలిచారని తెలిపారు. సుభాష్ ఘాయ్ న‌న్ను విప‌రీతంగా తిట్ట‌డంతో పాటు నా ఫ‌స్ట్ షో క్యాన్సిల్ చేయించేందుకు ప్ర‌య‌త్నించార‌ని.. నాకు ఛాన్సులు ఇవ్వొద్ద‌ని ఇత‌ర నిర్మాత‌ల‌ను కూడా ఆయ‌న కోరార‌ని ఆరోపించారు.

 

ఆ టైంలో నాకు సల్మాన్‌ ఖాన్, సంజయ్ దత్, డేవిడ్ ధావన్, రాజ్‌కుమార్ సంతోషి మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంతో పాటు ధైర్యం చెప్పార‌ని మ‌హిమ చెప్పారు. ఇక ఆయ‌న అలా చేయ‌డం వ‌ల్ల తాను కొన్ని సినిమాలు వ‌దులుకున్నాన‌ని.. వాటిలో 1998లో వచ్చిన రాంగోపాల్‌ వర్మ సత్యం చిత్రం కూడా ఉందన్నారు మహిమా చౌదరిఈ చిత్రం కోసం మొదట తననే తీసుకుని.. త‌ర్వాత త‌న స్థానిలో ఊర్మిళ‌ను తీసుకున్నార‌ని ఆమె చెప్పారు. ఇక ఈ సినిమా నుంచి త‌న‌ను తొల‌గిస్తున్న‌ట్టు వ‌ర్మ ఎలాంటి స‌మాచారం కూడా ఇవ్వ‌లేద‌ని ఆమె వాపోయారు. తాను ప‌రిశ్ర‌మ‌కే చెందిన వ్య‌క్తిని అయితే.. త‌న‌కు ఈ క‌ష్టాలు ఉండేవే కావ‌ని మ‌హిమ చెప్పారు.

Leave a comment