రెండోసారి త‌ల్లి అవుతోన్న స్టార్ హీరోయిన్‌…!

బాలీవుడ్‌లో నిన్న‌టి త‌రం క్రేజీ హీరోయిన్ కరీనా కపూర్‌ ఖాన్‌ రెండోసారి తల్లి కాబోతున్నారనే వార్తలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ వార్త‌ల‌పై స్పందించిన ఆమె తండ్రి ర‌ణ‌ధీర్ క‌పూర్ త‌న కుమార్తె ప్రెగ్నెన్సీ వార్త‌ల‌పై త‌న‌కే స‌మాచారం లేద‌ని.. అయితే అవి నిజం అయితే బాగుంటుంద‌ని అన్నారు. సైఫ్‌ అలీఖాన్‌, కరీనా దంపతులకు తొలి సంతానం మూడేళ్ల చిన్నారి తైమూర్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇక 2018లో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌రీనా మ‌రో రెండేళ్ల త‌ర్వాత మాత్ర‌మే తాను రెండో సంతానం గురించి ఆలోచ‌న చేస్తాన‌ని చెప్పింది.

I Hope It Is True Kareena Father Response On Second Grand Child - Sakshi

కరీనా ప్రాణ స్నేహితురాలు అమృతా అరోరా స్పందిస్తూ.. తాను విదేశాలకు వెళ్తున్నానని, ఏదైనా విశేషం ఉంటే చెప్పాలని అప్పట్లో జోక్ చేసింది. అమృత నాడు చేసిన వ్యాఖ్య‌ల‌తోనే క‌రీనా రెండోసారి త‌ల్ల‌వుతోంద‌న్న గుస‌గుస‌లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు కరీనా అద్వైత్ చందన్ దర్శకత్వంలో లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తోంది. అమీర్ ఖాన్‌తో కథానాయకుడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫారెస్ట్ గంప్‌కి రీమేక్.

 

వాస్త‌వంగా ఈ సినిమా క‌రోనా హ‌డావిడి లేకుండా ఉండి ఉంటే డిసెంబ‌ర్ 25న రిలీజ్ కావాలి… కానీ క‌రోనా నేప‌థ్యంలో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ? కూడా తెలియ‌ని ప‌రిస్థితి.

Leave a comment