పెళ్లి త‌ర్వాత కూడా నిహారిక హీరోయిన్‌గానే… మెగా ఫ్యామిలీలో సంక‌టం…!

మెగా డాటర్ నిహారిక గుంటూరు కోడ‌లు అవుతోంది. ఆమెకు గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యతో సగం పెళ్ళి పూర్తయింది. గురువారం వీరి ఎంగేజ్‌మెంట్ బంధువుల స‌మ‌క్షంలో వైభ‌వంగా జ‌రిగింది. ఇదిలా ఉంటే పెళ్లి త‌ర్వాత కూడా నిహారిక సినిమాల్లో న‌టిస్తుందా ? అన్న దానిపై చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. ఇప్ప‌టికే ఆమె హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో చేసినా అవేవి స‌క్సెస్ కాలేదు. దీంతో మెగా ఫ్యామిలీ అండ‌దండ‌లు ఉన్నా కూడా ఆమె ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోలేదు.

 

అయితే ఆమెకు ఇప్ప‌టికే కొన్ని క‌మిట్‌మెంట్స్ ఉండ‌డంతో అవి పెళ్ల‌యినా పూర్తి చేస్తుంద‌ని తెలుస్తోంది. ఆమె బుల్లితెర‌పై స‌త్తా చాటి హీరోయిన్‌గాను.. ఇటు వెబ్‌సీరిస్‌లు కూడా చేస్తోంది. ఈ క్ర‌మంలోనే వెండ‌తెర‌పై హీరోయిన్‌గా చేసినా చేయ‌క‌పోయినా ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల్లో న‌టించాల‌ని ఆమె ఆతృత‌గా ఉన్నార‌ట‌. ఇక వెబ్ సీరిస్‌లు నిర్మించ‌డంతో పాటు బుల్లితెర‌పై యాంక‌ర్‌గా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తాన‌ని చెప్పింద‌ట‌. అయితే ఆమె పెళ్లి త‌ర్వాత ఈ గ్లామ‌ర్ ఫీల్డ్‌కు దూరంగా ఉండాల‌ని మెగా ఫ్యామిలీ చెప్పినా ఆమె విన‌క‌పోవ‌డంతో ఆమె ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగానే ఆమె ప్రోత్స‌హించాల‌ని మెగా ఫ్యామిలీ డిసైడ్ అయ్యిందంటున్నారు.

Leave a comment