వాళ్లు నాకు అవ‌కాశాలు రాకుండా తొక్కేశారు… హాట్ యాంక‌ర్ అన‌సూయను టార్గెట్ చేసింది వీళ్లేనా…!

బుల్లితెర‌పై ప‌లు షోలు చేస్తూ హాట్ యాంక‌ర్ ఇమేజ్ తెచ్చుకున్న అన‌సూయ వెండితెర‌పై కూడా ప‌లు సినిమాల్లో న‌టిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. క్షణం – క‌థనం – సోగ్గాడే చిన్నినాయనా లాంటి సినిమాల్లో మంచి క్యారెక్ట‌ర్ల‌తో పాటు విన్న‌ర్ లాంటి సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్‌లో కూడా న‌టించింది. ఇక తాజాగా ఆమె కాస్టింగ్ కౌచ్‌, మీటుపై మాట్లాడింది. ఇక ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌ల్లో కూడా త‌న‌కు ఎప్పుడూ ఇలాంటి అనుభ‌వాలు ఎదురు కాలేద‌న్న ఆమె ఇండ‌స్ట్రీలో మీటూ, కాస్టింగ్ కౌచ్ కామ‌న్ అని చెప్పింది.

 

అయితే ఇవి జ‌ర‌గాలంటే అది అమ్మాయి తీసుకునే నిర్ణ‌యం మీదే ఆధార‌ప‌డి ఉంటుందని… ఆఫ‌ర్ల కోసం ఎప్పుడూ త‌లొగ్గ‌కూడ‌ద‌ని.. ఇది కాక‌పోతే మ‌రొక‌టి వ‌స్తుంద‌న్న ధీమాతో ఉండ‌డంతో పాటు టాలెంట్ ఉన్నోళ్లు ఎక్క‌డా రాజీ ప‌డాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని చెప్పుకొచ్చింది. అయితే తాను రెండేళ్ల క్రితం ఓ గ్రూఫ్ ఫేవ‌రిజం వ‌ల్ల చాలా ఇబ్బందులు ప‌డ్డాన‌ని.. వారంతా త‌న‌కు అవ‌కాశాలు రాకుండా చేశార‌ని చెప్పింది.

 

ఆ గ్రూఫ్ ఫేవ‌రింలో ఉన్న కొంద‌రు పెద్ద‌ల వ‌ల్ల తాను ఇబ్బందులు ప‌డ్డా కూడా … నన్ను నేను నమ్ముకొని ఈ స్థాయికి చేరుకున్నా అని అనసూయ అన్నారు. ఈ క్యారెక్టర్ నేను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనేంతలా కష్టపడితే కాస్టింగ్ కౌచ్‌, కాస్టింగ్ ఫిల్లో మ‌న ద‌గ్గ‌ర‌కే రావ‌ని చెప్పింది. ఇక ఇండ‌స్ట్రీలో టాప్ యాంక‌ర్‌గా ఉన్న అన‌సూయ‌ను టార్గెట్ చేస్తోన్న కొంద‌రు యాంక‌ర్ల‌తో పాటు టాప్ ప్రోగ్రామ్‌లు చేసే నిర్మాత‌ల‌ను ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్య‌లు చేసింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Leave a comment