నాగ్ అంటే క్ర‌ష్ అంటోన్న నిన్న‌టి క్రేజీ హీరోయిన్… చూడ‌గా‌నే ప‌డిపోయింద‌ట‌

ఇప్పుడు అంటే కాస్త వ‌య‌స్సు పైబ‌డిందే కాని… ఓ ప‌ది.. ఇర‌వై ఏళ్ల క్రితం నాగార్జున అంటే అమ్మాయిల‌కు ఎంత క్రేజ్ ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నాగార్జున సినిమా వ‌స్తుందంటేనే ఫ‌స్ట్ డే… ఫ‌స్ట్ షో చూసేందుకు అమ్మాయిలు క్యూలో ఉండే ప‌రిస్థితి. ఆయ‌న‌తో న‌టించాల‌ని అప్ప‌ట్లో ఎంతో మంది హీరోయిన్లు క‌ల‌లు క‌నేవారు. నాగ్‌తో ఒక్క ఛాన్స్ వ‌స్తే చాలని.. త‌మ జ‌న్మ ధైన్య‌మైన‌ట్టే అనుకున్న హీరోయిన్ల జాబితాలో క‌స్తూరి కూడా ఒక‌రు. నిన్న‌టి త‌రంలో క‌స్తూరి తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఎంతో మంది హీరోలతో కలిసి పని చేసింది.

 

ఈ క్ర‌మంలోనే నాగ్‌ను తాను తొలి చూపులో చూసిన వెంట‌నే ప‌డిపోయాన‌ని.. ఆయ‌నంటే త‌న‌కు ఎంతో క్ర‌ష్ అన్న ఆమె నాగార్జున‌తో క‌లిసి అన్న‌మ‌య్య‌, ఆకాశ‌వీథిలో సినిమాల్లో న‌టించింది. పైగా నాగ్ షేక్ హ్యాండ్ ఇచ్చిన రోజు, ఆ చేయిని ఎవరినీ ముట్టుకొనివ్వలేదని.. చేయి కడగకుండా అలాగే పడుకున్నానని చెప్పింది. ప్ర‌స్తుతం ఆమె ప‌లు సీరియ‌ల్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. ఆమె న‌టించిన గృహ‌ల‌క్ష్మీ సీరియ‌ల్ బాగా పాపుల‌ర్ అవుతోంది.

Leave a comment