టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ట్విటర్ వేదికగా అభిమానులకు గుడ్న్యూస్ చెప్పాడు. విరుష్క దంపతులు తల్లిదండ్రులు అవుతున్నారు. ఈ విషయాన్ని కోహ్లీ చెప్పడంతో కోట్లాది మంది విరుష్క అభిమానులు వీరికి శుభాకాంక్షలు చెపుతున్నారు. ఈ విషయాన్ని ట్విట్ఱర్ వేదికగా చెప్పిన కోహ్లీ ప్రస్తుతం నా భార్య అనుష్క గర్భవతి.. త్వరలోనే మా ఇంట్లోకి మూడో వ్యక్తి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు.. అది అబ్బాయా ? అమ్మాయ ? అన్న విషయం పక్కన పెడితే తాము మాత్రం పుత్రోత్సాహాన్ని ఎంజాయ్ చేస్తున్నామని చెప్పాడు.
మా ఆరు సంవత్సరాల రిలేషన్ షిఫ్లో బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అని చెప్పిన కోహ్లీ.. ఇప్పుడు మేం ఇద్దరిమే కానీ జనవరి 2021 తర్వాత మేం ముగ్గురం కాబోతున్నాం అంటూ పేర్కొన్నాడు. కాగా ట్విటర్లో విరాట్ తన భార్య అనుష్క శర్మతో లేటెస్ట్గా దిగిన ఫోటోను షేర్ చేశాడు. 2013 నుంచి రిలేషిన్షిప్లో విరుష్క జోడి.. 2017లో ఇటలీలో జరిగిన పెళ్లితో వైవాహిక జీవితం ప్రారంభించారు.