Newsబ్రేకింగ్‌: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు గుడ్ న్యూస్ వ‌చ్చేసింది

బ్రేకింగ్‌: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు గుడ్ న్యూస్ వ‌చ్చేసింది

క‌రోనా కార‌ణంగా తిరుమ‌ల చ‌రిత్ర‌లోనే లేని విధంగా తిరుమ‌ల శ్రీవారి ఆల‌యం మూత‌ప‌డింది. ఇప్పుడు ఆల‌యం తెర‌చుకోవ‌డంతో మ‌ళ్లీ ద‌ర్శ‌నాలు య‌ధావిథిగా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. ఇక వ‌చ్చే సెప్టెంబరు మాసంలో తిరుమలలో విశేష పర్వదినాలు ఉన్నాయి. సెప్టెంబ‌ర్ 1న అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తం, 17న మహాలయ అమావాస్య ఉంది. ఇక 18వ తేదీన తిరుమ‌ల శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ జ‌ర‌గ‌నుంది.

త‌ర్వాత రోజు సెప్టెంబ‌ర్ 19న ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఇక 23న శ్రీవారి గరుడసేవ, 24న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 26న ర‌థోత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు. 27న శ్రీవారి చక్రస్నానం, ధ్వ‌జా‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్త‌వుతాయి. ఇక‌ సెప్టెంబరు 28న శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం జ‌రుగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news