నాని హీరోయిన్‌తో బాల‌య్య రొమాన్స్‌కు రెడీ…!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌కు క‌థ‌, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు అన్ని బాగానే సెట్ అవుతాయి. అయితే ఆయ‌న ప‌క్క‌న న‌టించే హీరోయిన్లు మాత్రం త్వ‌రగా సెట్ కారు. ప్ర‌స్తుతం త‌న‌కు క‌లిసొచ్చిన బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య న‌టిస్తోన్న బీబీ3 సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ సినిమాలో బాల‌య్య ప‌క్క‌న న‌టించే హీరోయిన్ ఎవ‌రా ? అన్న దానిపై ఐదారు నెల‌లుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నా ఏ హీరోయిన్ ఇప్ప‌ట‌కీ ఫైన‌ల్ కాలేదు.

 

ఇక ఇప్పుడు వినిపిస్తోన్న టాక్ ప్ర‌కారం ఈ సినిమాలో బాల‌య్య ప‌క్క‌న లావ‌ణ్య త్రిపాఠిని ఫైన‌లైజ్ చేశార‌ని అంటున్నారు. అప్పుడెప్పుడో నాని ప‌క్క‌న భ‌లే భ‌లే మ‌గాడివోయ్, నాగ్‌తో సోగ్గాడే చిన్ని నాయ‌నా లాంటి హిట్ల త‌ర్వాత ఆమెకు స‌రైన హిట్ లేదు.. ఇటీవ‌ల ఆమెకు తెలుగులో అవ‌కాశాలు కూడా లేవు. ఇక కొద్ది రోజులుగా ఆమె గ్లామ‌ర్ షోకు రెడీ అన్న సంకేతాలు పంపుతోంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు యువ హీరోలు కూడా ఛాన్సులు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇప్పుడు బోయ‌పాటి ఆమెను బాల‌య్య ప‌క్క‌న ఫిక్స్ చేశాడ‌ని అంటున్నారు.

 

అప్పుడెప్పుడో నాగార్జున త‌ర్వాత మ‌ళ్లీ ఇన్ని రోజుల‌కు బాల‌య్య లాంటి సీనియ‌ర్ హీరో ప‌క్క‌న ఛాన్స్ అంటే ఇది లావ‌ణ్య‌కు గోల్డెన్ ఛాన్సే అనుకోవాలి. ఏదేమైనా స‌రైన హిట్ లేక ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఆశ‌తో ఉన్న లావ‌ణ్య‌కు…. ఇటు హీరోయిన్ కోసం వెయిటింగ్‌లో ఉన్న బాల‌య్య‌కు ఇప్పుడు క‌లిసొచ్చింది. మ‌రి ఆన్ స్క్రీన్‌పై బాల‌య్య – లావ‌ణ్య రొమాన్స్ ఎలా ఉంటుందో ? చూడాలి.

Leave a comment