ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్ రాజకీయం ముగిసినట్టే కనిపిస్తోంది. ఆయన ఎన్నో ఆశయాలతో స్థాపించిన పార్టీ ఇప్పుడు మూసివేత దిశగా వెళుతోంది. కరోనా ప్రబలుతోన్న నేపథ్యంలో చెన్నైలో సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు, నటుడు కమల్‌హాసన్ కార్యకర్తలను ఉద్దేశించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పార్టీపై ఉన్న హిందూ వ్యతిరేక ముద్రను ఎలా అధిగమించాలని సలహాలు, సూచనలు కూడా కోరారు. పార్టీ విధానాలు కార్యకర్తల ద్వారానే ప్రజల్లోకి చొచ్చుకుపోవాలని అన్న ఆయన.. తాను చెన్నైలోనే ఉంటున్నా… నిర్వాహకుల పనితీరుపై నిఘా పెట్టి ఉంచానని.. కార్యకర్తలు, నాయకులు సైతం తమ కింద పనిచేసే వారికి విలువ ఇవ్వాలని కోరారు.
ఇక తన భవిష్యత్తును పూర్తిగా ప్రజాసేవకే అంకితం చేశానన్నన కమల్… నా రాజకీయ పయనంలో నిర్వాహకుల వల్ల ఎదైనా ఆటకం కలిగితే తీవ్ర చర్యలు తీసుకుంటాను. ఆశయాలు, లక్ష్యాలను కాదని తప్పుడు మార్గంలో పయనిస్తే పార్టీ ఎత్తేసి మరో మార్గంలో ప్రజాసేవ వైపు వెళ్లేందుకు కూడా వెనుకాడనని కూడా కమల్ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి ? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ? కూటములు, పొత్తులు లాంటి అంశాలపై కూడా కార్యకర్తల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఏదేమైనా కమల్ హాసన్‌లో అప్పుడే నైరాశ్యం వచ్చిందని.. పార్టీ ద్వారా ఆయన ఎంతో సాధించాలనుకున్నా… అది సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చేశారని.. అందుకే ఆయన అవసరం అయితే పార్టీని మూసివేసి అయినా మరో మార్గంలో ప్రజాసేవకు వెళతానని అన్నారని తమిళ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.