ఒంగోలులో దారుణం… కోరిక తీర్చ‌మ‌ని త‌ల్లికే కొడుకు వేధింపులు… క్లైమాక్స్ ఇదే..!

క‌డుపున పుట్టిన బిడ్డే లైంగీక వేధింపుల‌కు పాల్ప‌డుతుండ‌డంతో గాయ‌ప‌డిన ఆ త‌ల్లి మ‌న‌స్సు ఐదేళ్ల పాటు ఎంతో గాయ‌ప‌డి.. చివ‌ర‌కు స‌హ‌నం కోల్పోయింది. చివ‌ర‌కు రౌడీషీట‌ర్ల‌కు సుపారీ ఇచ్చి మ‌రీ క‌న్న కొడుకును హ‌త్య చేయించింది. ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. ప్ర‌కాశం జిల్లా పొన్నలూరుకు చెందిన కుంచాల మాల్యాద్రి, లక్ష్మమ్మ దంపతుల కుమారుడు నరసింహారావు(35). ఇతనికి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక భార్య‌ను నిత్యం వేధిస్తుండ‌డంతో ఆమె పిల్ల‌ల‌ను తీసుకుని హైద‌రాబాద్‌ వెళ్లిపోయింది.

 

ఇది జ‌రిగి ఆరేళ్లు అయ్యింది.. కొన్నాళ్ల పాటు మౌనంగానే ఉన్న న‌ర‌సింహారావులో కామం బుస‌లు కొట్టింది.. నా భార్య‌ను తెస్తావా లేదా నువ్వే నాతో ప‌డుకుంటావా ? నా కోరిక తీరుస్తావా ? అంటూ తల్లినే వేధించాడు. కొడుకు ప్ర‌వ‌ర్త‌న‌తో తండ్రి ప‌క్ష‌వాతంతో మంచాన ప‌డ‌డంతో మ‌రింత రెచ్చిపోయి త‌ల్లిని వేధించేవాడు. బయటకు చెప్పుకుంటే కుటుంబ పరువుపోతుందంటూ ఆమె మౌనంగా ఉండింది. రోజురోజుకూ కుమారుడి వికృత చేష్టలు పెరగడంతో తట్టుకోలేక తన సోదరుడికి మొరపెట్టుకుంది.

 

చివ‌ర‌కు న‌ర‌సింహారావు త‌ల్లి, ఆమె మేన‌మామ క‌లిసి అత‌డిని చంపేయాల‌ని హ‌త్య‌కు ప్లాన్ చేశారు. చివ‌ర‌కు రౌడీ షీట‌ర్ల‌కు రు 1.70 ల‌క్ష‌ల‌కు సుపారీ ఇచ్చి మ‌రీ చంపించి అక్క‌డే మృత‌దేహాన్ని పూడ్చేశారు. ఈ సంఘ‌ట‌న త‌ర్వాత నాలుగు నెల‌ల త‌ర్వాత పోలీసుల‌కు వ‌చ్చిన క్లూతో ఈ హ‌త్య మిస్ట‌రీని చేధించారు.

Leave a comment