ఎన్టీఆర్ ఛానెల్ పేరు అదిరింది… సెంటిమెంట్‌తోనే టైటిల్‌…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఎన్టీఆర్ ఓ ఛానెల్ పెడుతున్నాడ‌న్న‌దే ఆ వార్త సారాంశం. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో కలిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో న‌టిస్తోన్న ఎన్టీఆర్ ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్‌తో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్‌తో కూడా ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ చేసే అవ‌కాశం ఉంద‌ని… టాలీవుడ్ బ‌డా నిర్మాత అల్లు అర‌వింద్ ఈ కాంబోలో సినిమా ప్లాన్ చేస్తున్నాడ‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఇప్పుడు పెట్టే ఛాన‌ల్ వ్య‌వ‌హారాలు అన్ని ఆయ‌న భార్య ల‌క్ష్మీప్ర‌ణ‌తి చూసుకుంటార‌ట‌. త‌న‌కు సంబంధించిన వ్య‌వ‌హ‌రాల‌తో పాటు త‌న సినిమాల విష‌యాలు తెలిపేందుకు.. ప‌ర్స‌న‌ల్ వ్య‌వ‌హారాలు అంద‌రితో పంచుకునేందుకు యూ ట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తున్నాడ‌ని టాక్‌.? ఇందుకోసం ప్ర‌ముఖ యాంక‌ర్ అన‌సూయ హెల్ఫ్ తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ ఛానెల్‌కు త‌న తండ్రి, కుమారుడు పేర్లు క‌లిసి వ‌చ్చేలా పేరు పెట్ట‌నున్నార‌ని అంటున్నారు.

 

ఎన్టీఆర్ తండ్రి అయిన దివంగ‌త హ‌రికృష్ణ పేరుతో పాటు కుమారుడు భార్గ‌వ్ రాం పేర్లు క‌లిసి వ‌చ్చేలా ఛానెల్ టైటిల్ ఉండ‌బోతోంద‌ట‌. హరికృష్ణలో హెచ్ భార్గవ్ రాం లో బీ వచ్చే విధంగా హెచ్ బీ అని… ఇంటి పేరు ఎన్ వచ్చే విధంగా పేరు పెట్టే అవకాశం ఉంది అని ఎన్ హైలెట్ అయ్యే విధంగా పేరు పెట్టే సూచనలు ఉన్నాయని అంటున్నారు. సెప్టెంబ‌ర్‌లో ఈ ఛానెల్‌కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Leave a comment