ఎన్టీఆర్ – మ‌హేష్ మ‌ల్టీస్టార‌ర్‌కు ఆ డైరెక్ట‌ర్ ఫిక్స్‌ అవుతాడా…!

టాలీవుడ్ టాప్ హీరోలు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు కాంబోలో భారీ మ‌ల్టీస్టార‌ర్ వ‌స్తుందా ? ఈ విష‌యంపై కొద్ది రోజులుగా ఒక‌టే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఈ మ‌ల్టీస్టార‌ర్ న్యూస్ ఎప్ప‌టి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిందో ? అప్ప‌టి నుంచే ఇండ‌స్ట్రీలో చిన్న‌పాటి ప్ర‌భంజ‌నం కూడా మొద‌లైంది. జూ.ఎన్టీఆర్ ఆల్రెడీ ఓ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 

ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఉన్నాయి. రామ్‌చ‌ర‌ణ్ – ఎన్టీఆర్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ అనేది అస్స‌లు ఎవ్వ‌రూ ఊహించ‌ని కాంబినేష‌న్‌. ఈ కాంబోలో సినిమాను సెట్ చేసి రాజ‌మౌళి నిజంగానే ఓ ట్రెండ్ సెట్ చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ – మ‌హేష్‌బాబు కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ అంటూ ఊహించ‌డానికే థ్రిల్లింగ్‌గా ఉంది. వీరి కాంబోలో అల్లు అర‌వింద్ సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టాప్ రైటర్స్‌తో ఓ అదిరిపోయే క‌థ‌ను వీరి కోసం రెడీ చేయించే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ట‌.

 

మ‌రి వీరి కాంబోలో సినిమా వ‌స్తే.. వీరి ఇమేజ్ బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయ‌డం ఏ ద‌ర్శ‌కుడి వ‌ల్ల అవుతుంద‌న్న‌ది ఊహ‌కే అంద‌డం లేదు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో రాజ‌మౌళి త‌ప్పా ఇంకెవ్వరూ ఈ హీరోలను హ్యాడిల్ చెయ్యలేడని కామెంట్ చేస్తున్నారు సినీజనాలు. మరి ఈ మల్టీస్టారర్ కూడా రాజమౌళి దగ్గరికే వెళ్తుందా.. లేక మరెవరైనా టేకప్ చేస్తారా అన్నది చూడాలి.

Leave a comment