SportsIPL 2020: బీసీసీఐ టార్గెట్ ఎన్ని కోట్లో తెలిస్తే షాకే.. మైండ్...

IPL 2020: బీసీసీఐ టార్గెట్ ఎన్ని కోట్లో తెలిస్తే షాకే.. మైండ్ బ్లాకే…

మ‌రి కొద్ది రోజుల్లోనే ఐపీఎల్ 2020 ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే చైనా వ‌స్తు బ‌హిష్క‌ర‌ణ‌తో ఐపీఎల్ స్పాన్స‌ర్‌షిఫ్ నుంచి వివో వైద‌లొగ‌డంతో ఇప్పుడు మ‌రో స్పాన్స‌ర్‌ను వెతుక్కోవాల్సిన అవ‌స‌రం బీసీసీఐకు ఏర్ప‌డింది. ప్ర‌తి యేడాది వివో ఏకంగా రు. 440 కోట్లు చెల్లిస్తోంది. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో అంత మొత్తం ఇవ్వ‌డం ఏ కంపెనీకి అయినా క‌ష్ట‌మే. అయితే ఇంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లో కూడా క‌నీసం రు. 300 కోట్లు స్పాన్స‌ర్‌షిప్ ద్వారా రాబ‌ట్టాల‌ని బీసీసీఐ టార్గెట్‌గా పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది.

 

ఈ క్ర‌మంలోనే అధికారిక స్పాన్స‌ర్ల‌ను మూడు నుంచి ఐదుకు పెంచుకోవ‌డం ద్వారా కొత్తగా వచ్చే ఒక్కో స్పాన్సర్‌ నుంచి కనీసం రూ. 40 కోట్ల చొప్పున రాబట్టాలని బీసీసీఐ వ్యూహాలు రచిస్తుంది. కొత్త స్పాన్స‌ర్‌షిప్ రేసులో అమెజాన్‌, బైజూస్‌, డ్రీమ్‌ లెవెన్‌ ఉండగా.. అనూహ్యంగా కొత్త సంస్థ తెరపైకి వచ్చే అవకాశాలున్నట్టు బోర్డు వర్గాలు వెల్లడించాయి. గ‌త ఐపీఎల్ నుంచి బీసీసీఐ రు. 618 కోట్లు రాబ‌ట్టింది… ఇందులో వివో ఒక్క‌టే రు. 440 కోట్లు ఇచ్చింది.

 

ఇక అధికారిక పార్ట్‌నర్స్ అయిన టాటా మోటార్స్, ఎఫ్‌బీబీ, డ్రీమ్ ఎలెవన్ రూ.120 కోట్లు చెల్లించాయి. ఇప్పుడు బీసీసీఐ పెట్టుకున్న టార్గెట్ రు. 300 కోట్లు వ‌చ్చినా మ‌రో రు. 140 కోట్లు న‌ష్ట‌మే. అయితే ఈ క‌రోనా క‌రువు కాలంలో రూ.300 కోట్లు రెవెన్యూ వచ్చినా గొప్ప విష‌య‌మే అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news