క‌రోనా రూల్స్ భేఖాతార్ చేసిన పాక్ క్రికెట‌ర్‌… రెండో టెస్టుకు అవుట్‌..!

క‌రోనా దెబ్బ‌తో చాలా రోజులుగా ఆగిపోయిన క్రికెట్ మ్యాచ్‌లు మ‌ళ్లీ ఎట్ట‌కేల‌కు ప్రారంభ‌మ‌య్యాయి. చాలా క‌ఠిన‌మైన రూల్స్‌, క‌రోనా నిబంధ‌న‌ల‌తో ఇప్ప‌టికే ఇంగ్లండ్ – వెస్టిండిస్ టెస్ట్ సీరిస్ జ‌రిగింది. ఇక తాజాగా ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. రెండో మ్యాచ్ మొదలుకాకముందే పాకిస్థాన్ కు ఎదురు బెబ్బ తగిలింది. పాక్ ఆల్ రౌండర్ మొహమ్మద్ హఫీజ్ క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించాడు. మ్యాచ్ లో పాటించాల్సిన బయో-సేఫ్ ప్రోటోకాల్‌ను హఫీజ్ ఉల్లంఘించాడు.

 

ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌కు ముందు అగాస్ బౌల్ ప్రక్కనే ఉన్న గోల్ఫ్ కోర్సుకు మొహమ్మద్ హఫీజ్ టీమ్ వెళ్ళింది. అక్కడ హ‌ఫీజ్ ఓ వృద్ధురాలితో దిగిన ఫొటో త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది వైర‌ల్ కావ‌డంతో ఇప్పుడు హ‌ఫీజ్ రెండో టెస్టుకు దూరం కావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. హ‌ఫీజ్ ప్ర‌స్తుతం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ విషయం పై పాకిస్థాన్, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాయి అనేది చూడాలి.

Leave a comment