ఇద్ద‌రు హీరోల‌తో ప్రేమాయ‌ణం… హీరోయిన్ క్లారిటీ…!

తెలుగు ప్రేక్షకులకు లీడర్ చిత్రంతో పరిచయం అయిన ప్రియా ఆనంద్ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా కూడా ఆమెకు ఇక్క‌డ మంచి గుర్తింపు రాలేదు. తెలుగుతో పాటు త‌మిళ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసింది. తెలుగు కంటే త‌మిళ్‌లోనే ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంద‌నే చెప్పాలి. ఇదిలా ఉంటే ముందు యంగ్ హీరో అధ‌ర్వ‌తో ఆమె ప్రేమాయ‌ణంలో ఉంద‌న్న ప్ర‌చారం జరిగింది. ఈ వార్త‌ల‌ను కొట్టేసిన ఆమె మళ్లీ కార్తీక్ తనయుడు గౌతమ్ తో ప్రేమలో మునిగి తేలుతోంద‌న్న ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది.

 

గౌత‌మ్‌, ప్రియా క‌లిసి ఉన్న ఫొటోలు బాగా వైర‌ల్ అయ్యాయి. దీంతో ఆమె అధ‌ర్వ లేదా గౌత‌మ్‌ల‌లో ఎవ‌రో ఒక‌రితో ప్రేమ‌లోనే ఉంద‌ని అనుకున్నారు. ఇప్పుడు ఈ ప్రేమాయ‌ణం వార్త‌లు, ఫొటోల‌పై ప్రియా స్పందించింది. తాను ఎవరితో ప్రేమలో లేను. గౌతమ్ మరియు అధర్వలు నాకు మంచి స్నేహితులు. తాము ముగ్గురం రెగ్యుల‌ర్‌గా క‌లుసుకోవ‌డంతో పాటు ఒక‌రి అభిప్రాయాలు.. మ‌రొక‌రితో షేర్ చేసుకుంటామ‌ని చెప్పింది. మ‌రి ఇప్ప‌ట‌కి అయినా ప్రియా ప్రేమాయ‌ణం వార్త‌ల‌కు ఫుల్‌స్టాప్ ప‌డుతుందేమో ? చూడాలి.

Leave a comment