పవర్‌స్టార్ పవన్ కళ్యాన్‌కు వీరాభిమాని అయిన ఓ యువకుడి రు. కోటి జీతంతో పాటు విలాస వంతమైన జీవితం వదులుకుని కష్టపడి చదివి ఐఏఎస్ అయ్యాడు. ప్రజా సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఐఏఎస్ అయిన ఆ యువకుడు నేడు సీఎం జగన్ సొంత జిల్లాలో పోస్టింగ్ అందుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలానికి చెందిన ఇమ్మడి పృథ్వితేజ్ తండ్రి శ్రీనివాసరావు నగల వ్యాపారి కాగా… తల్లి గృహిణి. ఏడో తరగతి వరకు సొంత ఊళ్లోనే చదువుకున్న పృథ్వి ఆ తర్వాత గుడివాడ విశ్వభారతిలో చదువుకున్నాడు. 2011లో నిర్వహించిన ఐఐటీలో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించి.. ఐఐటీ ముంబైలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో చేరారు.
బీటెక్ కంప్లీట్ అయిన వెంటనే రు. కోటి రూపాయల జీతంతో దక్షిణ కొరియాలో సామ్‌సంగ్ సంస్థ ఉద్యోగం ఆఫర్ చేసింది. రెండేళ్ల పాటు ఆ ఉద్యోగం చేసిన పృథ్వి తన చిన్ననాటి కల అయిన సివిల్స్‌ను సాకారం చేసుకునేందుకు కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే ఏకంగా ఆల్ ఇండియా స్థాయిలో 24వ ర్యాంక్ సాధించి తన కల సాకారంచేసుకున్నాడు. ఇక ఐఏఎస్ అయ్యాక చిత్తూరులో సహాయ కలెక్టర్‌గా పనిచేశారు.. తర్వాత శ్రీకాళహస్తిలో విధులు నిర్వర్తించారు. అనంతరం సెక్రటేరియట్ ఎనర్జీ విభాగంలో శిక్షణ పొందారు.. తర్వాత ఐఏఎస్‌గా కడపలో మొదటి పోస్టింగ్ వచ్చింది.. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో. ప్రజలందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని అందించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.