Politicsతెలంగాణ‌లో మ‌రో మెట్రో రైల్ ప్రాజెక్టు... ఆ జిల్లాకు కెవ్వు కేక...

తెలంగాణ‌లో మ‌రో మెట్రో రైల్ ప్రాజెక్టు… ఆ జిల్లాకు కెవ్వు కేక పెట్టించే న్యూస్‌

తెలంగాణ‌లో రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే మెట్రో రైల్ ప‌రుగులు పెడుతోంది. ఇక్క‌డ మెట్రో రైల్ ప్రాజెక్టు స‌క్సెస్ అవ్వ‌డంతో పాటు రోజుకు ఏకంగా 2 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు జ‌ర్నీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో హైద‌రాద్ మెట్రో ప‌రుగుల‌కు తాత్కాలికంగా బ్రేక్ ప‌డినా క‌రోనా పోయాక తిరిగి ఇక్క‌డ మెట్రో రైళ్లు ప‌రుగులు పెట్ట‌నున్నాయి. ఈ మెట్రో స‌క్సెస్ కావ‌డంతో ఇప్పుడు తెలంగాణ‌లో మ‌రికొన్ని జిల్లాల‌కు కూడా మెట్రోను విస్త‌రించాల‌న్న ప్ర‌య‌త్నాలు అప్పుడే ప్రారంభ‌మ‌య్యాయి.

 

హైద‌రాబాద్ త‌ర్వాత తెలంగాణ‌లో వ‌రంగ‌ల్ న‌గ‌రం శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు వ‌రంగ‌ల్‌లో మెట్రో రైల్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ చొర‌వ తీసుకుంటున్నారు. మ‌హారాష్ట్ర త‌ర‌హాలో మెట్రోనియా ప్రాజెక్టును వ‌రంగ‌ల్ జిల్లాలో ప్రారంభించ‌నున్నార‌ట‌. ఇందుకు సంబంధించి మూడు నెల‌ల్లో డీపీ సిద్ధ‌మ‌వుతోంద‌ట‌. దీని ప్ర‌కారం న‌గ‌రంలో 15 కిలోమీట‌ర్ల మేర ఈ లైన్ ఏర్పాటు చేయ‌నున్నార‌ట‌. కాజీపేట‌, పెట్రోల్ పంపు, పోచ‌మ్మ మైదాన్‌, వెంక‌ట్రామా టాకీస్ మీదుగా, వ‌రంగ‌ల్ రైల్వేస్టేష‌న్ వ‌ర‌కు ఈ మెట్రో రైల్ ఉంటుంద‌ని తెలుస్తోంది.

 

ఇందుకోసం రు.1400 కోట్లు అవ‌స‌రం అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. గ‌తేడాదే మ‌హారాష్ట్ర మెట్రో టీం వ‌రంగ‌ల్ వ‌చ్చి అంచ‌నాలు రూపొందించింది. ఇక్క‌డ మెట్రో ఏర్పాటు చేస్తే ప్ర‌జ‌లు మెట్రో ఎక్కేందుకు ఆస‌క్తితో ఉన్నార‌ని తేలాకే మెట్రో ఏర్పాటుకు ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు రు. కోటితో ఇక్క‌డ డీపీఆర్ రూపొందిస్తున్నారు. వ‌రంగ‌ల్‌కు మెట్రో వ‌స్తే ఈ జిల్లా మ‌రింత ఎట్రాక్ష‌న్ అవుతుంది అన‌డంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news