భార్య ఊరెళ్ల‌గానే ప్రియురాలితో రాస‌లీల‌లు… హైద‌రాబాద్ ఎఫైర్‌లో క్లైమాక్స్ ఇదే..!

హైద‌రాబాద్‌లో ఓ మ‌హిళ‌తో ఓ వ్య‌క్తి వివాహేత‌ర సంబంధం కాస్తా చివ‌ర‌కు ఆ ప్రియురాలు హత్య‌కు కార‌ణ‌మైంది. ఉప్ప‌ల్ పోలీసుల వివ‌రాల ప్ర‌కారం న‌ల్ల‌గొండ జిల్లా మోత్క‌రు మండ‌లానికి చెందిన డి. అంజ‌య్య ( 30) చిలుకాన‌గ‌ర్లో భార్య‌తో పాటు 18 నెల‌ల కుమారుడితో కాపురం ఉంటున్నారు. డీసీఎం డ్రైవ‌ర్ అయిన అంజ‌య్య‌కు నాచారంలో కూర‌గాయ‌ల వ్యాపారం చేసుకునే రేణుక (30)తో వివాహేత‌ర సంబంధం ఉంది. క‌ర్నాకట‌క ప్రాంతానికి చెందిన ఆమె భ‌ర్త చ‌నిపోవ‌డంతో ఇక్క‌డ ఉంటూ కూర‌గాయ‌ల వ్యాపారం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా అంజ‌య్య భార్య పుట్టింటికి వెళ్ల‌డంతో రేణుక‌తో రాస‌లీల‌ల కోసం త‌న గ‌దికి పిలిపించుకున్నాడు. రాత్రి మద్యం తాగిన తర్వాత రేణుక తన అవసరం నిమిత్తం డబ్బులు కావాలని అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

 

ఆవేశం ప‌ట్ట‌లేని అంజ‌య్య బీరు సీసాతో రేణుక త‌ల‌మీద కొట్ట‌డంతో పాటు ఆమె కింద ప‌డ్డాక కాలుతో మొడ‌పై నొక్కి చంపేశాడు. ఆ త‌ర్వాత ప‌రార‌య్యాడు. స్థానికులు వీరి కేకలు విని లోప‌ల‌కు రాగా రేణుక అప్పటికే మృతి చెందింది. దీంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు వ‌చ్చి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. మృతురాలికి 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

Leave a comment