Politicsభార్య ద‌గ్గ‌ర ప్ర‌తి మగాడు దాచే ఆ మూడు ర‌హ‌స్యాలివే..!

భార్య ద‌గ్గ‌ర ప్ర‌తి మగాడు దాచే ఆ మూడు ర‌హ‌స్యాలివే..!

నీ జీవితాంతం నీకు తోడు ఉంటాన‌ని.. నీ క‌ష్ట‌సుఖాల్లో వెన్నంటే ఉంటాన‌ని అగ్నిసాక్షిగా ప్ర‌తిజ్ఞ చేయ‌డంతో పాటు భార్య మెడ‌లో మూడుముళ్లు వేస్తాడు భ‌ర్త‌. భార్య భ‌ర్త‌లు అయిన‌ప్ప‌టి నుంచి జీవితాంతం క‌లిసి ఉన్నా కూడా కొంత మంది కాదు చాలా మంది భ‌ర్త‌లు భార్య‌ల ద‌గ్గ‌ర కొన్ని సీక్రెట్లు దాచేస్తుంటార‌ట‌. భ‌ర్త మీద భార్య ఎంత నిఘా పెట్టినా కూడా ఈ అంశాల్లో మాత్రం భ‌ర్త‌లు నిజాలు దాచేస్తుంటార‌నే చాలా ప‌రిశోధ‌న‌లు చెపుతున్నాయి. మ‌రి ఈ మూడు అంశాలు ఏంటో చూద్దాం.

 

1- ప‌రాయి స్త్రీల ప‌ట్ల ఆక‌ర్ష‌ణ‌:
చాలా మంది మ‌గాళ్ల‌కు ప‌రాయి స్త్రీల మీద ఆక‌ర్ష‌ణ ఉంటుంది. అది వ‌య‌స్సు ప్ర‌భావం కావొచ్చు.. లేదా ప‌నిచేసే వాతావ‌ర‌ణంలో ఏర్ప‌డిన చ‌నువు కావొచ్చు.. లేదా ఇటు భార్య‌తో త‌న‌న‌కు.. అటు ఆమె భ‌ర్త‌తో ఆమెకు ల‌భించ‌ని స్వాతంన‌.. ఇత‌ర ఆప్యాయ‌త‌లు కూడా వీరు ఒక‌రికి ఒక‌రు కోరుకుంటారు. ఈ క్ర‌మంలోనే వీరి మ‌ధ్య ఏర్ప‌డిన ఆ చ‌నువు కాస్తా బంధానికి … అక్ర‌మ సంబంధానికి కార‌ణ‌మ‌వుతుంది. మ‌రి కొంద‌రిలో ఈ ప‌రా‌యి స్త్రీల‌తో సంబంధం పెళ్లికి ముందు కూడా ఉంటుంది. ఇలాంటి విష‌యాల‌ను ఏ భ‌ర్త కూడా భార్య‌కు చెప్ప‌డు.

 

2- భార్య‌పై కోపం కూడానా…
ఇక చాలా మంది భ‌ర్త‌ల‌కు భార్య‌ల‌పై అనేక విష‌యాల్లో విసుగు, కోపం వ‌స్తుంటాయి. ఒకే అంశంపై ఇద్ద‌రు వేర్వేరుగా అభిప్రాయాలు వ్య‌క్తం చేసిన‌ప్పుడు.. ఇద్ద‌రు త‌మ మాటే నెగ్గాల‌నుకున్న‌ప్పుడు భార్యకు న‌చ్చ‌చెప్ప‌లేక మ‌గాడు మాత్ర‌మే మౌనం దాలుస్తాడ‌ట‌. ఇక ఆమె పెట్టే టార్చ‌ర్ విష‌యంలోనూ మౌనంగానే ఉంటాడ‌ట‌.

 

3- ఫైనాన్షియ‌ల్ మ్యాట‌ర్ :
ఇక భ‌ర్త‌లు దాదాపు 99 శాతం మంది త‌న సంపాద‌న ఎంత‌నే విష‌యాన్ని భార్య‌ల‌కు చెప్పేందుకు ఇష్ట‌ప‌డ‌ర‌నే అంటారు. త‌న సంపాద‌న ఎంత‌నేది భార్య‌కు చెపితే ఆమె ఆ లెక్క‌లు వివ‌రాలు అగ‌డ‌డంతో పాటు ఆ ఖ‌ర్చులు అన్నీ అడుగుతుంద‌ని.. అందుకే ఆర్థిక వివ‌రాలు భార్య‌ల‌కు చెప్ప‌ర‌న్న నానుడి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news