ముదురు హీరోయిన్ కస్తూరి ప్రస్తుతం పెళ్లి చేసుకుని చెన్నైలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. ఆమె తాజాగా ఈటీవీలో ప్రసారం అయ్యే అలీ టాక్ షోలో కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. అప్పట్లో నాగార్జున ఇప్పడు విజయ్ దేవరకొండ అంటే తనకు క్రష్ అని చెప్పి బాంబు పేల్చిన ఆమె తన అనుభవాలు కూడా పంచుకుంది. అన్నమయ్య షూటింగ్ టైంలో నాగార్జునతో తన అనుభవాలు పంచుకున్న ఆమె గతంలో తాను చేసిన వివాస్పద ఫొటో షూట్‌పై స్పందించింది.
బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో ఆ బిడ్డతో న్యూడ్ గా ఒక ఫొటో షూట్ ను కస్తూరి ఇచ్చింది. ఆ విషయంలో చాలా చర్చ జరిగింది. ఒక సౌత్ హీరోయిన్ ఈ స్థాయిలో న్యూడ్‌గా ఫొటో షూట్ చేయడం… అందులోనూ ఓ పసిబిడ్డను ఎత్తుకుని ఇలా చేయడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఓ హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ఉన్న కస్తూరి ఇలా చేయడం ఏంటా అని చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. దీనిపై అప్పుడు స్పందించిన కస్తూరి ఇప్పుడు రిప్లే ఇచ్చింది.
తల్లి పాల ప్రాముఖ్యత అవగాహణ కల్పించేందుకు ఆ ఫొటో షూట్ చేశాము. అది ఒక మ్యాగజైన్ కోసం ఈ ఫొటో షూట్ చేశామని.. అది విదేశాల్లో షూట్ చేశామని.. అయితే ఇది లీక్ అయ్యి ఇండియా వరకు కూడా వచ్చేసిందన్నారు. ఆ ఫొటోలో తాను ఎలాంటి తప్పు చేయకపోయినా మన వాళ్లు మాత్రం ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేశారని ఆమె వాపోయింది.