Moviesఆచార్య మోష‌న్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది... రెండు స‌స్పెన్స్‌లు అలాగే ఉంచేసిన కొర‌టాల‌

ఆచార్య మోష‌న్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది… రెండు స‌స్పెన్స్‌లు అలాగే ఉంచేసిన కొర‌టాల‌

మెగాస్టార్ చిరంజీవి – కొర‌టాల శివ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న ఆచార్య సినిమా మోష‌న్ పోస్ట‌ర్ ఈ రోజు మెగాస్టార్ 66వ బ‌ర్త్ డే సంద‌ర్భంగా వ‌చ్చేసింది. ముందు నుంచి ప్ర‌చారంలో ఉన్న ఆచార్య పేరును ఈ సినిమాకు ఫైన‌లైజ్ చేశారు. ఇక మోష‌న్ పోస్ట‌ర్‌ను చూస్తుంటే చిరంజీవి ధ‌ర్మ‌స్థ‌లి అనే ఊరు కోసం పోరాటం చేస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ అయినా కూడా కొర‌టాల రెండు విష‌యాల్లో మాత్రం స‌స్పెన్స్ అలాగే ఉంచేశాడు. సినిమా క‌థ ఏంట‌న్న‌దానిపై పూర్తిగా రివీల్ చేయ‌కుండా స‌స్పెన్స్‌లోనే ఉంచారు. అలాగే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోందని చెబుతున్నా దాని మీద క్లారిటీ అయితే ఈ మోషన్ పోస్టర్ లో ఇవ్వలేదు. ఇక 2021 స‌మ్మ‌ర్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించారు. సినిమాకు చారిత్ర‌క నేప‌థ్యం ఉంద‌ని కూడా మోష‌న్ పోస్ట‌ర్ చూస్తుంటే తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news